Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో ఆ పార్టీదే హవా.. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ తేల్చేశాయి..!
TS Lok Sabha Election 2024 Exit Poll Results Live: సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేడు వెల్లడికానున్నాయి. అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా.. సర్వే సంస్థలు ప్రజల నాడి ఎలా ఉందని తేల్చనున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు..? ఎన్నికల్లో విజేతగా నిలిచేది ఎవరు..? తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..
Telangana Exit Poll Election Results 2024 Live Updates: దేశవ్యాప్తంగా ప్రజల నాడి ఎలా ఉంది..? కేంద్రంలో బీజేపీ మ్యాజిక్ మళ్లీ పనిచేస్తుందా..? ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా..? తెలంగాణ ఓటర్ల మనోగతం ఎలా ఉంది..? అనేది సర్వే సంస్థలు ఇవాళ తేల్చనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరే కాంగ్రెస్ దూసుకువస్తుందా..? బీఆర్ఎస్ పుంజుకుంటుందా..? బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందా..? అనేది ఉత్కంఠగా మారింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుండగా.. సర్వాత్ర ఆసక్తి రేకేత్తిస్తోన్న ఎగ్జిట్ పోల్స్ నేడు సాయంత్రం 6.30 గంటల నుంచి వెల్లడికానున్నాయి. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
Hyderabad Lok Sabha Exit Polls: లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా హైదరాబాద్ లోక్‌సభ స్థానంపై ఆసక్తి ఉంది. అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ తరఫున మాధవీలత పోటీ చేయడం ఆసక్తికర పోరు సాగింది. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారో సర్వే సంస్థలు ఇవే చెప్పాయి. వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Telangana Exit Poll Live Updates: NDTV: ఎన్డీఏ 365, ఇండియా కూటమి 142, ఇతరులు 36... న్యూస్ నేషన్: ఎన్డీఏ 342-378, ఇండియా కూటమి 153-169
Telangana Exit Poll Live Updates: జక్ కీ బాత్: కాంగ్రెస్ 2-7, బీజేపీ 9-12, బీఆర్ఎస్-1, ఇతరులు-1
Telangana Exit Poll Live Updates: ఆరా తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: బీజేపీ 8-9 స్థానాల్లో విజయం, కాంగ్రెస్ 7-8, ఎంఐఎం 1, బీఆర్ఎస్ 0
Telangana Exit Poll Live Updates: NDA కూటమికి 359 సీట్లు వస్తాయని రిపబ్లిక్ టీవీ- PMARQ సర్వే వెల్లడించింది. ఇండియా కూటమికి 154 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులు 30 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది
Telangana Exit Poll Live Updates: మొత్తం ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
Telangana Exit Poll Live Updates: దేశవ్యాప్తంగా 57 స్థానాలకు పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. కాసేపట్లో ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెల్లడికానున్నాయి. సర్వే ఫలితాలపై ఆసక్తి నెలకొంది.
Telangana Exit Poll Live Updates: మన దేశంలో ఎగ్జిట్‌పోల్స్ 1957 ఎన్నికల నుంచి మొదలయ్యాయి. అప్పట్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అనే సంస్థ మొదట్లో సర్వేలు నిర్వహించింది. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
Telangana Exit Poll Live Updates: ఇండియా కూటమికి 295కి పైగా సీట్లు వస్తున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు.