Telangana Politics Live: కౌశిక్ రెడ్డి.. నీ ఒంటిపై బట్టలుండవ్.. దానం నాగేందర్ మాస్ వార్నింగ్

Fri, 13 Sep 2024-5:48 pm,

Telangana News Live Updates: బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ నేతలు సమావేశానికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Telangana News Live Updates: తెలంగాణ పాలిటిక్స్‌లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు ఆరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మాటల యుద్ధంతో గురువారం అంతా హైటెన్షన్ నెలకొనగా.. నేడు ఆరెకపూడి ఇంట్లో సమావేశానికి బీఆర్‌ఎస్‌ పిలుపు ఇవ్వడంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. వివేకానంద నగర్‌లోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. కాలనీకి వెళ్లే దారలను బ్యారికేడ్లో క్లోజ్‌ చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే గాంధీ ఇంటికి బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, కూకట్ పల్లి ఏసీపీ శ్రీనివాసరావు చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యావేక్షిస్తున్నారు. మరోవైపు తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్‌ నేతలను హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్‌ జిల్లా బీఆర్ఎస్‌ అధ్యక్షుడు శంభీపూర్‌ రాజును హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేక్‌ ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. మేడ్చల్‌ జిల్లా పార్టీ కార్యాలయానికి కూడా పోలీసులు భారీగా చేరుకున్నారు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

Latest Updates

  • MLA Arekapudi Gandhi News Updates: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి వ్యవహారం అత్యంత విచారకరమని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. పార్టీ మారిన వ్యక్తి ప్రభుత్వ అండతో రౌడీయిజం చేశారని, ప్రభుత్వ వైఫల్యంగా సీఎం రేవంత్ బాధ్యత వహించాలన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించారని.. ఇలాంటి ఘటనలు ప్రోత్సహించలేదన్నారు. 

  • MLA Arekapudi Gandhi News Updates: మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి హౌస్ అరెస్ట్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> బోయినపల్లి లోని ఎమ్మల్యే కార్యాలయం వద్ద మోహరించిన పోలీసులు.

    ==> MLA మర్రి రాజశేఖర్ రెడ్డిని బయటకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.

  • Ex Minister Harish Rao Arrest: హైదరాబాదులో మాజీ మంత్రి హరీష్ రావుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం తగదని.. సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.  

  • Ex Minister Harish Rao Arrest: హరీశ్ రావును హాస్పిటల్‌కు తరలింపు..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> నిన్న అరెస్ట్ సందర్బంగా హరీష్ రావు భుజంకు గాయం..

    ==> తన నివాసం నుంచి చికిత్స నిమిత్తం AIG హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు.

  • MLA Arekapudi Gandhi News Updates: డీసీపీ మేడ్చల్ కోటిరెడ్డి కామెంట్స్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> ఇక్కడ 144 సెక్షన్ అమలులో ఉంది.

    ==> పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు.

    ==> ఉదయం నుంచి అందరిని అందులోకి తీసుకున్నాము

    ==> ఇప్పటివరకు 20 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు 

    ==> వినాయక చవితి నవరాత్రుల ఉత్సవ సందర్భంగా లా & ఆర్డర్  విషయంలో కఠినంగా ఉన్నాము

    ==> నిన్న జరిగిన సంఘటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేశాం.

    ==> పరిస్థితి కుదుటపడిన తర్వాత వారిని పంపిస్తాము.

  • MLA  Arekapudi Gandhi News Updates: కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటి వద్ద పోలీసుల భారీ బందోబస్తు.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> ఎమ్మెల్యే గాంధీ ఇంటికి రావాలని బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు.

    ==> ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన కార్యాలయంలో పార్టీ నేతలతో కార్పొరేటర్లతో సమావేశం.

    ==> ఇరు ప్రాంతాలలో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తున్న పోలీసులు.

    ==> ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు.
     

  • MLA Arekapudi Gandhi News Updates: ఎమ్మెల్యే ఆరికెపూడి నివాసానికి చేరుకున్న దానం నాగేందర్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> అడ్డగోలుగా మాటలు మాట్లాడే వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి

    ==> పాడి కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఏంటో నాకు తెలుసు.. రమ్మనండి చూస్కుందాం

    ==> సహచర ఎమ్మెల్యే గాంధీ టిఫిన్ చేయడానికి ఇన్వైట్ చేస్తే వచ్చాను.

    ==> జిల్లా విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యాలయంలో చేస్తారా..! ఇండ్లలో చేస్తారా..?

    ==> ఇన్ని ఏండ్ల తరవాత గాంధీ ఇల్లు మీటింగ్ కోసం గుర్తుకు వచ్చిందా..?

    ==> పాడి కౌశిక్ రెడ్డి మాటలు మహిళల్ని కించ పరిచేలా ఉన్నాయి

    ==> గతంలో మహిళ గవర్నర్ ఉదేశించి మాట్లాడినా కుర్చీ కిందాపైన అనే వ్యాఖ్యలు అందరికి తెలుసు

    ==> మన ఆడవాళ్లు తల్చుకుంటే కౌశిక్ ఒంటిపై బట్టలుండవ్

    ==> బట్టలేకుండా చేస్తారు జాగ్రత్త

  • Ex Minister Mallareddy Arrest: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో గాంధీ ఇల్లు పిలుపులో భాగంగా బయటకు రాకుండా అడ్డుకున్నారు. బోయినపల్లిలోని మల్లారెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు.  

  • Ex Minister Harish Rao Arrest: కోకాపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్టు చేసిన పోలీసులు 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> హరీష్ రావు ఇంటి వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు..

    ==> ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి హరీష్ రావును కలిసేందుకు వచ్చే ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు..
     

  • BRS Leaders Arrest News Live Updates: చేతి గాయంతో బాధపడుతున్న మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని, మాజీ ఎంపీ మాలోతు కవితను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.

  • BRS Leaders Arrest News Live Updates: లా అండ్ ఆర్డర్ పట్ల సీఎం సీరియస్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి

    ==> రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని ఫైర్.

    ==> రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని  డీజీపీకి సూచించారు. 

    ==> ఈరోజు మధ్యాహ్నం పోలీస్ యంత్రాంగంపై పూర్తి రివ్యూ

    ==> శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.

    ==> తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పనవి హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి.

    ==> నిన్న కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర జరిగిన ఉద్రిక్తతలు మరోసారి పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link