Telugu States Rains Live Updates: తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సీఎం విజ్ఞప్తి

Sun, 10 Jul 2022-3:20 pm,

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Telugu States Rains Live Updates: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు మరో 3 రోజులు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ మీకోసం... 

Latest Updates

  • ములుగు జిల్లా

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    తాడ్వాయి మండలం నార్లాపూర్ పసరా  గ్రామాల మధ్య నేల కూలిన భారీ వృక్షం..

    వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది 

    తానే స్వయంగా గొడ్డలితో చెట్టు నరికి ట్రాఫిక్ క్లియర్ చేసిన ఏఎస్పీ రామనాథ్

  • జగిత్యాల ధర్మపురి రహదారిపై రాకపోకలకు అంతరాయం
    ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నుండి 5 వేల క్యూసెక్కుల నీటి విడుదల

    శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని చెరువులు కుంటలు నిండి పోయాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇప్పటికే అధికారులు జిల్లా ప్రజలకు సూచనలు జారీ చేశారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వరద పోటెత్తుతున్న ప్రాంతాలపై జిల్లా కలెక్టర్ రవి, ఎస్పీ సింధు శర్మ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు.మరోవైపు భారీగా చేరుతున్న వరద దృష్ట్యా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి వరద కాలువ (FFC) ద్వారా MMR కు 5000 క్యూసెక్కుల నీటిని ఆదివారం ఉదయం విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. 

  • రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో  అన్ని జిల్లాల కలెక్టర్లతో  టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్..

  • సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోగుట మండలం కూడవెల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుండి నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు వంతెనపై నుండి వెళ్లరాదని అధికారులు సూచిస్తున్నారు 

  • నిజామాబాద్ జిల్లాలో గల శ్రీరామ్ సాగర్ జలాశయంలోకి భారీగా సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల గ్రామా ప్రజలు అప్రమతంగా ఉండాలని వాగులు ,నదులకు దాటరాదని ప్రాజెక్ట్ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు.

  • తెలంగాణలో కొనసాగుతున్న అల్ప పీడన ద్రోణి కారణంగా మూడు రోజులుగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఏకధాటిగా వర్షాలు దంచి కొడుతు న్నాయి.  దీనితో వాగులు ,వంకలు ,చెరువులు,ప్రాజెక్టులన్నీ వరద నీటితో జలసంద్రమయ్యాయి. నిజామాబాద్ మండలంలోని లింగి తాండలోని నిజాంసాగర్ కాలువలో గల్లంతయిన ఇద్దరు పశువుల కాపర్ల జాడ ఆదివారం ఉదయం వరకు కూడా ఆచూకి తెలియలేదు. గజ ఈతగాళ్లు,రెస్క్యూ టీమ్  లు రెండు రోజులుగా వెతుకుతూనే ఉన్నారు. అన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటలు మత్తడులు పారుతున్నాయి.

  • మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గత రెండు రోజులుగా భారీ కురుస్తున్న వర్షాలకు పంది పంపుల వాగు పొంగి పొర్లుతోంది. దీంతో బయ్యారం పెద్ద చెరువులోకి భారీగా వరద నీరు చేరుతోంది. 

    చెరువు నిండుకుండలా మారడతో ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

  • రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరో 14 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

  • తెలంగాణకు వరదల హెచ్చరిక

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    తెలంగాణకు ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ వరదల హెచ్చరిక జారీ 

    తెలంగాణాలో వర్షాలు ఇలాగే కొనసాగితే రానున్న 24గంటల్లో పలు జిల్లాలో వరదలు స్తంభావించే అవకాశం

    ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లె, ములుగు, జిల్లాల్లో వరద ప్రమాదం ఉంటుందని అంచనా

  • ప్రజలకు విజ్జప్తి :
     

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అనవసరంగా రిస్కు తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా వుండాలని, తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్జప్తి చేశారు. 

    ఇరిగేషన్ శాఖ అప్రమత్తంగా ఉండాలి :
     

    గోదావరి ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున వరదలు వస్తున్నాయని.. ఈ నేపథ్యంలో, ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత చర్యలు తీసుకోవాలని సీఎం ఇరిగేషన్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

    రెవెన్యూ సదస్సులు వాయిదా :

    భారీ వర్షాల నేపథ్యంలో ఈనెల 11 న ప్రగతి భవన్ లో  నిర్వహించతలపెట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల  ‘రెవెన్యూ సదస్సుల అవగాహన’ సమావేశంతో పాటు.. 15 వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించతలపెట్టిన ‘రెవెన్యూ సదస్సులను’ మరో తేదీకి వాయిదా వేస్తున్నట్టు సిఎం తెలిపారు. ఇందుకు సంబంధిచిన తేదీలను వాతావరణ పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత ప్రకటిస్తామని సీఎం అన్నారు.

  • ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు 

    రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు.  దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించాలని, వరద ముంపు ప్రాంతాలల్లోని అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీం లను అప్రమత్తం చేయాలన్నారు.
    మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ వున్ననేపథ్యంలో  తాను పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూంటానని పరిస్థితులనుబట్టి నేడో రేపో వీడియో కాన్ఫరెన్సు కూడా నిర్వహిస్తానని సిఎం కెసిఆర్ తెలిపారు. జిల్లాలల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా వుండాలని సిఎం అన్నారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడాలని ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. 

  • విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతున్న నీరు.

    ప్రాజెక్ట్ లోని 3, 11, 17, నెంబర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలిన అధికారులు.

  • తెలంగాణలో రాగల మూడు రోజులకు  వాతావరణ విశ్లేషణ,  వాతావరణ  హెచ్చరికలు : 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    నిన్న దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి విస్తరించిన ఆవర్తనం ప్రభావంతో  ఇవాళ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తన సగటున సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి  ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి దిశగా మారింది.

    రాగల 3 రోజులకు వాతావరణ సూచన

    రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో  తేలికపాటి  నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. 

     రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షంతో పాటు  అతి భారీ వర్షాలు, ఈరోజు అత్యంత భారీ వర్షాలు అక్క డక్కడ కురిసే అవకాశం ఉంది .

  • నిజామాబాద్ జిల్లా నవీపేట్‌లో అత్యధికంగా 23.4 సెం.మీ వర్షపాతం

  • శేరిలింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు కారణంగా వాహనదారుల తీవ్ర ఇబ్బందులు 
    మ్యాన్ హోల్స్ నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా మురుగు నీరు
     మరుగు నీరు చేరకుండా చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు 

  • సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

    భారీ వర్షాలకు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రామగుండం రీజియన్ లోని మూడు ఏరియాలలో ఉన్న నాలుగు ఉపరితల బొగ్గు గనులలో (ఓపెన్ కాస్ట్) బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. పని స్థలాలలో భారీగా వాన నీరు చేరడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. భారీ యంత్రాలు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు అప్రమత్తమై ఓపెన్ కాస్ట్ గనులలో ఉత్పత్తిని నిలిపివేశారు. ఒక రోజుకు నాలుగు ప్రాజెక్టులలో సుమారు 70 వేల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. వర్షం కారణంగా ఉత్పత్తి తో పాటు రవాణా కూడా అంతరాయం ఏర్పడుతోంది. పూర్తిస్థాయిలో వర్షం తగ్గితేనే తిరిగి ఓపెన్ కాస్ట్ గనుల్లో పనులు ప్రారంభమవుతాయని అధికారులు అంటున్నారు.

  • నిండుకుండల ా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 

    భారీ వర్షాలకు  పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలంలో ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తోంది. జలాశయానికి భారీగా వరద నీరు చేరింది. దీంతో సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జలాశయం ముంపు గ్రామాలు పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టు సంబంధించిన ఎలాంటి గేట్లు ఎత్తకపోవడంతో నిండుకుండలా కనిపిస్తుంది. 148 మీటర్ల ఎత్తుకుగాను 145.64 వరకు నీరు చేరింది.వజలాశయం అవుట్ ఫ్లో 422 క్యూసెక్కులుగా నమోదయింది. 

  • భారీ వర్షాలకు జలమయంగా మారిన హైదరాబాద్ కొండాపూర్‌‌లోని హైటెన్షన్ రోడ్ పరిసరాలు..

  • తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్నందునా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచన
    హైదరాబాద్‌లో రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ టీమ్స్..

     

  • మంజీరా పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్ 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బోధన్ మండలం సాలురా వద్ద గల మంజీరా నదిలోకి వర్షపు నీరు 

    భారీగా వర్షాలతో నిలిచిపోయిన మంజీరా బ్రిడ్జి నిర్మాణ పనులు

    ఎగువన  కురుస్తున్న భారీ వర్షాలకు దిగువకు వరద నీరు

    మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారుల హెచ్చరిక

  • జగిత్యాలలో భారీ వర్షాలు.. ప్రమాదకరంగా చింతకుంట చెరువు

    జగిత్యాల జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రోడ్డులో గల చింతకుంట చెరువు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మత్తడి దూకి ప్రవహిస్తోంది. మరో రెండు రోజులు వర్షాలు ఇలాగే కురిస్తే చెరువు నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

  • కామారెడ్డిలో 4 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఐదు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

    బ్రాహ్మణపల్లి, టేక్రియాల్, చందాపూర్, కాలోజివాడి, సంగోజివాడి, తాడ్వాయి గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు.

    ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.

  • నందిపేట్‌లో 20 సెం.మీ వర్షపాతం

    ఇవాళ ఉదయం 8.30గం. వరకు తెలంగాణలో అత్యధికంగా నిజామాబాద్‌లోని నందిపేట్‌లో 20 సెం.మీ వర్షపాతం నమోదైంది. చాలా జిల్లాల్లో 10 సెం.మీ మేర వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో నిన్న రాత్రి అత్యధికంగా ఉప్పల్‌లో 7 సెం.మీ వర్షపాతం నమోదైంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link