TS Inter Result 2024 Live: ఇంటర్ ఫలితాలు బిగ్ అలర్ట్.. ఆ రోజు నుంచే సప్లిమెంటరీ పరీక్షలు

Wed, 24 Apr 2024-11:42 am,

Telangana Inter Result 1st &2nd Year Live: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు ఉదయం 11 గంటలకు వెల్లడికానున్నాయి. విద్యార్థులు https://tsbie.cgg.gov.in/, https://results.cgg.gov.in/ వెబ్‌సైట్లలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.

Telangana Inter Results 2024 Live Updates: తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రిలల్ట్స్ కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలోనే రాష్లితాల వెల్లడికి  ఇంటర్ బోర్డు కసరత్తు చేసింది. రేపు జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదలవుతున్న నేపథ్యంలో ముందుగానే ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఫస్టియర్, సెంకడియర్ రిజల్ట్స్‌ను ఒకేసారి విడుదల చేయనున్నారు. తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 9 లక్షల 80 వేల 978 మంది ఇంటర్ పరీక్షలు రాశారు. గతేడాది పరీక్షలు ఏప్రిల్ 15న ముగియగా.. ఫలితాలు మే 9న వెల్లించారు. గత డాదితో పోలిస్తే ఈసారి పరీక్షలు 15 రోజులు ముందే అయిపోయినా.. ఫలితాల వెల్లడి మాత్రం కాస్త ఆలస్యమైంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇంటర్ రిజల్ట్స్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 

Latest Updates

  • TS Inter Results 2024 Live Updates: రేపటి నుంచి మే 2వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.

  •  ఫస్ట్ ఇయర్‌లో 2.87 లక్షల మంది, సెకండ్ ఇయర్‌లో లక్షల మంది విద్యార్థులు పాసయ్యారు. ఫస్ట్ ఇయర్లో 60.01%, సెకండ్ ఇయర్లో 64.18% మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్లో బాలికలు బాలురు 51.05% మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్లో బాలికలు 72.53%, బాలురు 56.01% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ రంగారెడ్డి 71.07శాతంతో టాప్ ప్లేస్‌లో, సెకండియర్లో ములుగు 82.95 శాతంతో తొలి స్థానంలో నిలిచింది.
     

  • TS Inter Results 2024 Live Updates: మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటర్ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి మార్క్స్‌ మెమో డౌన్‌లోడ్ చేసుకోండి.
     

  • TS Inter Results 2024 Live Updates: ఇంటర్ ఫలితాలను చెక్ చేయడానికి ఇక్కడ లింక్ చేయండి. 
     

  • TS Inter Results 2024 Live Updates: ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు టాప్-2 ప్లేస్‌లో నిలిచాయి. గతేడాది కంటే ఫస్టియర్‌లో 2 శాతం ఉత్తీర్ణత తగ్గింది.
     

  • TS Inter Results 2024 Live Updates: ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి మార్క్స్ మెమోలు ఆన్‌లైన్‌ అందుబాటులోకి రానున్నాయి.

  • TS Inter Results 2024 Live Updates: ఫస్ట్ ఇయర్‌లో 60 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండ్ ఇయర్‌లో 64 శాతం మంది పాస్ అయ్యారు. సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా టాప్ ప్లేస్‌లో నిలిచింది.

  • TS Inter Results 2024 Live Updates: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. results.cgg.gov.in, tsbie.cgg.gov.in, bie.telangana.gov.in వెబ్‌సైట్స్ ద్వారా ఫలితాలు తెలుసుకోండి.

  • TS Inter Results 2024 Live Updates: తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 24, 2024న ఉదయం 11:00 గంటలకు విద్యాశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి శృతి ఓజా రిలీజ్ చేయనున్నారు.
     

  • TS Inter Results 2024 Live Updates: ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..

    ==> అధికారిక tsbie.cgg.gov.in.  వెబ్‌సైట్‌ను సందర్శించండి - 
    ==> రిజల్ట్స్ సెక్షన్ ఓపెన్ చేయండి.
    ==> హాల్ టిక్కెట్ నంబర్‌తో సహా మీ వివరాలను ఎంటర్ చేయండి.
    ==> ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షం అవుతాయి.

  • TS Inter Results 2024 Live Updates: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్మీడియట్ పరీక్షలలో విద్యార్థుల ఫలితాలను అంచనా వేయడానికి 4-పాయింట్ గ్రేడింగ్ విధానాన్ని ఉపయోగిస్తుంది. 

    ==> A - 75% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు 
    ==> B -  60% నుండి 74.9% మార్కులు 
    ==> C -  50% నుండి 59.9% మార్కులు 
    ==> D - 35% నుండి 49.9% మార్కులు 

  • TS Inter Results 2024 Live Updates: తెలంగాణ ఇంటర్ ఫలితాలు digilocker, results.cgg.gov.in, tsbie.cgg.gov.in, bie.telangana.gov.in, 'T Folio' మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.
     

  • TS Inter Results 2024 Live Updates: గత నాలుగేళ్లలో ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం ఇలా.. 
    ==> 2023 -63.49%
    ==> 2022 - 67.16%
    ==> 2021 - 100%
    ==> 2020 - 68.86%

  • TS Inter Results 2024 Live Updates: గతేడాది ఫలితాల్లో అమ్మాయిలు సత్తాచాటారు. ఫస్టియర్‌లో 68.68 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించగా.. 54.66 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 71.57 శాతం అమ్మాయిలు, 55.6 శాతం మంది అబ్బాయిలు పాస్ అయ్యారు. 
     

  • TS Inter Results 2024 Live Updates: 

    ==> పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు
    ==> హాజరైన విద్యార్థులు: 5,02,260
    ==> జనరల్ కేటగిరీ విద్యార్థులు: 4,55,655
    ==> ఒకేషనల్ కేటగిరీ విద్యార్థులు: 46,605

  • TS Inter Results 2024 Live Updates: ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు సాధించాలి.

  • TS Inter Results 2024 Live Updates: విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ల ద్వారా https://tsbie.cgg.gov.in/, https://results.cgg.gov.in/ వెబ్‌సైట్లలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 
     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link