Lizard In Bawarchi Biryani: బావర్చి బిర్యానీ... హైదరాబాద్‌లోనే కాదు.. ఈ భాగ్య నగరంతో పరిచయం ఉన్న భోజన ప్రియులకు అందరికీ ఇష్టమైన ఫుడ్ స్పాట్. ఇంకా చెప్పాలంటే నగరం సరిహద్దులు దాటి విదేశాలకు పాకిన ఘనత బావర్చి బిర్యానిది. అయితే, బావర్చి బిర్యానికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు కొన్ని విమర్శలకు తావిచ్చే ఘటనలతోనూ ఈ రెస్టారెంట్ వార్తల్లోకెక్కుతోంది. తాజాగా బావర్చి బిర్యానీ మరోసారి వార్తల్లోకి రావడానికి కారణం.. అక్కడి చికెన్ బిర్యానీలో బల్లి రావడమే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవును.. హైదరాబాద్​లో ఆర్టీసీ క్రాస్​ రోడ్​లోని బావర్చి బిర్యానీలో బల్లి వచ్చిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారికి ఈ చేదు అనుభవం ఎదురైంది. బావర్చి రెస్టారెంట్​ నుంచి చికెన్ బిర్యానీ పార్శిల్​ తెప్పించుకున్నారు. బావర్చి నుంచి తెప్పించిన చికెన్ బిర్యానీ కదా అని ఆవురావుమని సగం తినేశారు. సగం చికెన్ బిర్యానీ తిన్న తర్వాత ప్లేట్​లో ఏదో తేడాగా ఓ ఆకారం కనిపించింది. ఆ ఆకారం చూడటంతోనే తినడం ఆపేసి కాస్త పరిశీలించి చూస్తే.. అప్పుడు అర్థమైంది.. ఆ ఆకారం ఇంకేంటో కాదు.. బబ.. బల్లి అని. 


సగం తిన్న చికెన్ బిర్యానీలో బల్లి కనిపించడం చూసిన కస్టమర్లకు కడుపులో చెయ్యి పెట్టి దేవినట్టయింది. జరిగిన ఘోరం చూసి కళ్లు బైర్లు కమ్మినట్టయింది. కడుపులో తిప్పినట్టు.. ఏదేదో మిక్సుడ్ ఫీలింగ్. వెంటనే సగం తిన్న బిర్యానీ ప్లేట్​లో చచ్చిపడి ఉన్న ఆ బల్లిని అలాగే వీడియో తీసిన కార్పొరేటర్ చిక్కడపల్లి పోలీసులు, జీహెచ్​ఎంసీ ఫుడ్​ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన గడ్డం నవీన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు బావర్చి రెస్టారెంట్ లో తనిఖీలు చేపట్టారు.


జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారుల సోదాల్లో వెలుగుచూసిన విస్తుగొలిపే అంశాలు
జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు జరిపిన దాడుల్లో బావర్చి బిర్యానీ కస్టమర్స్ విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. కరోనావైరస్‌తో పాటు నానా వ్యాధులు ప్రభలుతున్న ప్రస్తుత తరుణంలోనూ బావర్చి రెస్టారెంట్‌లో ఆహారం తయారు చేసే సిబ్బంది, వడ్డించే సిబ్బంది చేతులకు గ్లోవ్స్ ధరించకుండా, తలకు హెయిర్ నెట్ ధరించకుండా, ముఖానికి మాస్కులు ధరించకుండానే తమ విధులు నిర్వర్తిస్తున్నట్టు ఫుడ్  సేఫ్టీ వింగ్ అధికారులు గుర్తించారు.


[[{"fid":"232823","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"lizard-found-in-hyderabad-bawarchi-biryani-customer-files-complaint-against-bawarchi-restaurant.jpg","field_file_image_title_text[und][0][value]":"lizard-found-in-hyderabad-bawarchi-biryani-customer-files-complaint-against-bawarchi-restaurant.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"lizard-found-in-hyderabad-bawarchi-biryani-customer-files-complaint-against-bawarchi-restaurant.jpg","field_file_image_title_text[und][0][value]":"lizard-found-in-hyderabad-bawarchi-biryani-customer-files-complaint-against-bawarchi-restaurant.jpg"}},"link_text":false,"attributes":{"alt":"lizard-found-in-hyderabad-bawarchi-biryani-customer-files-complaint-against-bawarchi-restaurant.jpg","title":"lizard-found-in-hyderabad-bawarchi-biryani-customer-files-complaint-against-bawarchi-restaurant.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


అంతేకాకుండా కిచెన్ పరిసరాలన్ని తడి, నూనె జిడ్డుతో మురికి మురికిగా ఉండటం గుర్తించిన అధికారులు.. ఇదే విషయాన్ని తమ నివేదికలో పొందుపరిచారు. వంట తయారీకి అవసరమైన ముడి సరుకు అపరిశుభ్రంగా ఉన్న నేలపైనే పడేసి ఉండటం, స్టోరేజీ రూమ్ సైతం అపరిశుభ్రంగా ఉన్నాయని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. 


బావర్చి రెస్టారెంట్‌పై ఫిర్యాదు ఇచ్చిన కస్టమర్ నుండి సేకరించిన చికెన్ బిర్యానీ శాంపిల్‌తో పాటు రెస్టారెంట్‌లోని చికెన్ బిర్యానీ శాంపిల్‌ని సైతం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఫుడ్ ల్యాబోరేటరీకి పంపించినట్టు ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు మీడియాకు తెలిపారు. ఫుడ్ ల్యాబోరేటరీ నుంచి వచ్చే నివేదిక ప్రకారం బావర్చి రెస్టారెంట్‌పై తదుపరి చర్యలు ఉంటాయని, ప్రస్తుతం షోకాజ్ నోటీసులు జారీచేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.


Also read : KA Paul Comments: మత విధ్వేషాలు దేని కోసం..బండి సంజయ్‌పై కేఏ పాల్ ఫైర్


Also read : Telangana Police Jobs: పోలీస్‌ ఉద్యోగాలకు అభ్యర్థుల ఆసక్తి..దరఖాస్తులు ఎన్నంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.