Telangana lockdown timings: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు.. లాక్‌డౌన్ కొత్త టైమింగ్స్
Lockdown in telangana extended: హైదరాబాద్: తెలంగాణలో జూన్ 10 నుంచి లాక్‌డౌన్ మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కొత్త టైమింగ్స్, సడలింపులు (Lockdown new timings) ఇలా ఉన్నాయి.
Lockdown in telangana extended: హైదరాబాద్: తెలంగాణలో జూన్ 10 నుంచి లాక్‌డౌన్ మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న లాక్‌డౌన్ కరోనా పాజిటివ్ కేసులను తగ్గించడంలో సత్ఫలితాలను ఇచ్చిందని భావిస్తూ పరిస్థితిని మరింత అదుపులోకి తీసుకురావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేబినెట్ వర్గాలు తెలిపాయి. జూన్ 10 నుంచి మరో 10 రోజుల పాటు పలు సడలింపులు ఇస్తూనే లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు కేబినెట్ వెల్లడించింది.
Lockdown new timings - లాక్‌డౌన్ కొత్త టైమింగ్స్, సడలింపులు :
జూన్ 10వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఒక గంట పాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సాయంత్రం 6 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను (Lockdown timings in telangana) కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ పోలీసు శాఖకు ఆదేశాలు జారీచేసింది.
Also read : TS Cabinet meeting important points:తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు
సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజక వర్గాల పరిధిలో కరోనావైరస్ ఇంకా పూర్తిగా అదుపులోకి రానందున.. ఆయా నియోజకవర్గాల పరిధిలో మాత్రం లాక్‌డౌన్ యధావిధిగా కొనసాగించనున్నట్టు కేబినెట్ (Telangana cabinet meeting) స్పష్టంచేసింది. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also read : PRC approved in TS: ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్లకు Good news.. PRCకి కేబినెట్ ఆమోదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook