హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళలనలతో సతమవుతున్న తరుణంలో తెలంగాణ వ్యాప్తంగా మే 7 వరకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలకు స్విగ్గి, జోమోటో అనుమతి రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఈ నిబంధనలు రేపటినుండి అమల్లోకి వస్తాయని, అంతేకాకుండా ఎలాంటి పండగా  కార్యక్రమాలైన పరిమిత సంఖ్యలో తమ ఇళ్లలోనే జరుపుకోవాలని అన్నారు. రంజాన్‌ మాసం వస్తున్నా తరుణంలో ఎలాంటి సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు 18 మందికి కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, కేబినెట్‌ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేని జిల్లాలు రాష్ట్రంలో 4 ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2.44 శాతంగా ఉందని, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8 రోజులకు రెట్టింపవుతోందని, రాష్ట్రంలో వైద్య సిబ్బందికి అవసరమయ్యే పరికరాల కొరతను అధిగమించామన్నారు. ఏప్రిల్‌ 20 తర్వాత కూడా రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు ఉండవని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సడలింపులు ప్రకటించినప్పటికీ, తెలంగాణలో పరిస్థితుల దృష్ట్యా మే 3 వరకు నిబంధనలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.  


కాగా గతంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రం నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం ప్రభుత్వం చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అలాగే తెలంగాణలో లాక్ డౌన్ ను మే 7 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. 
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..