Lok Sabha Election Results 2024: చేవెళ్లలో బీజేపీ ఆధిక్యం.. దూసుకుపోతున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి..
Lok Sabha Election Results 2024: దేశ వ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలో ఎన్టీయే మ్యాజిక్ మార్క్ దాటినా.. వాళ్లు చెప్పినట్టుగా 400 దాటడం కష్టమే కనిపిస్తోంది. బీజేపీకి పట్టున్న యూపీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ కాస్త వెనకబడినట్టు ట్రెండ్స్ చెబుతున్నాయి. కానీ తెలంగాణలో బీజేపీ మాత్రం దూసుకుపోతుంది.
Lok Sabha Election Results 2024: దేశ వ్యాప్తంగా బీజేపీ పెట్టుకున్న 400 టార్గెట్ రీచ్ కావడం కష్టమే అని ట్రెండ్స్ చెబుతున్నాయి. మరోవైపు ఎన్టీయే మ్యాజిక్ మార్క్ దాటింది. మరోవైపు తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. అక్కడ మెజారిటీ సీట్లలో లీడింగ్ లో ఉంది. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. ఈయన తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జి. రంజిత్ రెడ్డిపై దాదాపు 20 వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తరుపున కాసాని జ్ఞానేశ్వర్ బరిలో ఉన్న పెద్దగా ప్రభావం చూపించలేదనే చెప్పాలి.
చేవేళ్ల పార్లమెంట్ స్థానం 2009లో ఏర్పడింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో చేవేళ్ల, మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేరిలింగం పల్లి, పరిగి, వికారాబాద్, తాండూర్ స్థానాలున్నాయి. మొదటి సారి ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి విజయం సాధించారు. 2014లో ఈ స్థానం నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ తరుపున గెలిచారు. 2019లో ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధి రంజిత్ రెడ్డి గెలిచారు. ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో నిలిచారు. ఇక 2024 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తరుపున బరిలో నిలిచారు. ఇపుడీ స్థానం నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ తరుపున గెలుస్తారా.. ? లేదా అనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook