Andhra pradesh and telangana elections campign has ended: కేంద్ర ఎన్నికల సంఘం రెండు తెలుగు రాష్ట్రాలలో నాలుగో విడతలో ఎన్నికల కోసం షెడ్యూల్ ను ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొన్నిరోజులుగా రెండు తెలుగు స్టేట్స్ లలో ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరింది. తెలంగాణలోని 17 , లోక్ సభ స్థానాలు, ఏపీలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. మే 13 న పోలింగ్ జరగనున్నాయి. ఈరోజు శనివారం ఎట్టకేలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సాయత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఈసీ ప్రచారానికి అనుమతినిచ్చింది. ఆరు తర్వాత ఎట్టిపరిస్థితుల్లో ప్రచారం నిర్వహించకూడదంటూ ఆదేశాలు జారీచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బయటి వారు వెళ్లిపోవాలి..


ఎన్నికల ప్రచారం ముగియడంతో బైట నుంచి వచ్చిన వారంతా ఎన్నికల ప్రదేశాలనుంచి వెళ్లి పోవాలని ఈసీ ఆదేశించింది. కేవలం ఆ గ్రామం, నియోజక వర్గం, స్థానికంగా ఓటు హక్కు ఉన్న వారు మాత్రమే ఉండాలని మిగతా వారు మాత్రం వెళ్లిపోవాలని ఈసీ స్పష్టం చేసింది. పోలీసులు పకట్బందీ చర్యలు చేపట్టాలని ఎలాంటి ప్రలొభాలకు గురిచేసే ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఈసీ సూచించింది. ఇక దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలలో మాత్రం బైటవారు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. 


అమల్లోకి వచ్చేసిన 144 సెక్షన్..


ఇక ఎన్నికలు జరిగే ప్రాంతాలలో  144 సెక్షన్ అమల్లోకి వచ్చేసిందని ఈసీ తెలిపింది. ఎక్కడ కూడా నలుగురు ఒక చోటు గుమిగూడి కన్పించకూడదంటూ ఈసీ తెలిపింది. బల్క్ ఎస్ఎమ్మెస్ లు, సైతం పంపవద్దంటూ ఈసీ స్పష్టం చేసింది.మరోవైపు పత్రికల్లో ప్రకటనల కోసం ప్రీ సర్టిఫికేషన్ తీసుకొవాలన్నారు. అదే విధంగా రేపు ఆదివారం సాయంత్రం లోగ ఎన్నికల సిబ్బంది ఈవీఏంలను తీసుకుని పోలీంగ్ కేంద్రాలకు వెళ్తారని అన్నారు. సోమవారం నాడు ఉదయం అధికారుల ముందు, పోలీంగ్ ఏజెంట్ల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారని ఈసీ తెలిపింది.


ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమౌతుందని తెలిపారు. సాయంత్రం 6 వరకు పోలింగ్ ఉంటుందన్నారు.  ఓటింగ్ కేంద్రానికి 200 ల మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీలు ఎలాంటి చిహ్నాలు ప్రచారం చేయోద్దని స్పష్టం చేసింది. ఓటింగ్ కు వచ్చే ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో వాహాన శ్రేణితో రావోద్దని, ఎన్నికల నియామవళికి అనుగుణంగా ప్రవర్తించాలని ఈసీ తెలిపింది. క్యూలో ఉన్న వారికి తమకు ఓటు వేయాలంటూ సైగలు చేయడం, గుర్తును చూపించడం వంటివి చేయకూదంటూ ఈసీ తెలిపింది. మరోవైపు జూన్ 4 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 


Read more: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...


Read more: BJP Madhavi Latha: జాతీయ స్థాయిల్లో గొడవలు చేస్తాం.. పోలీసులకు బీజేపీ మాధవీలత మాస్ వార్నింగ్..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter