Malkajgiri loksabha elections results 2024: మల్కాజ్ గిరిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయనకు 3.81 లక్షల ఓట్లకు పైగా మెజారిటీ వచ్చింది. ఇదిలా ఉండగా లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ప్రజలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణలోని 17 స్థానాలకు కనీసం ఒక్క స్థానంకూడా గెలవలేకపోయారు. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం.. కాంగ్రెస్, బీజేపీల మధ్యనే పొటీ నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..


మల్కాజ్ గిరిలో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్ లోను ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 21 రౌంట్లు కౌంటింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఈటల రాజేందర్ కు.. 3,81,380 లక్షల ఓట్లకు పైగా మెజారిటీ సాధించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న సునీతా మహేందర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణలో ఇప్పటి వరకు బీజేపీ 8 స్థానాలు  గెలుపొందింది. మరికొన్ని స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది.


మల్కాజ్ గిరిలో తొలిసారి 2009 లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో సర్వే సత్యనారయణ గెలుపొందారు. ఇక్కడ ఇప్పటి దాక మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. దీన్ని మినీ ఇండియాగా అనికూడా పిలుస్తారు. అందుకే దేశంలో ఇప్పుడు మల్కాజ్ గిరి లోక్ సభ స్థానంహాట్ టాపిగ్ మారింది. 2008 లో మల్కాజ్ గిరి నియోజవర్గం ఏర్పడిందని చెబుతారు. మూడు సార్లు కూడా భిన్నమైన పార్టీలకు చెందిన వారిని ప్రజలు ఎంపిక చేశారు.  ఇక్కడ మెజారీటీ గా స్థానికంగా ఉన్న ప్రజలతో పాటు,  స్థానికేతులు  కూడా ఉన్నారు. 


మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు మల్కాజిగిరి లోక్ సభ స్థానం పరిధిలోకి వస్తాయి. ఇది పూర్తిగా పట్టణ జనాభాతో కూడిన నియోజకవర్గం. 2014 లో టీడీపీ తరపున మల్లారెడ్డి ఎంపీగా గెలుపొందారు. 2019 లో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచారు. మల్లారెడ్డి అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డిపై రేవంత్ 10,919 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి 603,748 ఓట్లు పోలవగా.. మర్రి రాజశేఖర రెడ్డికి 5,92,829 ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామచంద్ర రావు 3,04,282 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.


ఎంపీ నుంచి ముఖ్యమంత్రి వరకు..


2019 లో మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి అనంతరం టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి విజయం సాధించారు. సీఎల్పీ లీడర్‌గా ఎన్నికైన ఆయన తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టే ముందు ఎంపీ పదవికి రాజీనామా చేశారు.


లక్కీ సీటు ఇది..


మల్కాజిగిరి నుంచి ఇప్పటి వరకూ గెలిచిన ముగ్గురు అభ్యర్థులకు ఆ తర్వాత అదృష్టం వరించింది. సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి కాగా.. మల్లారెడ్డి అనంతర కాలంలో రాష్ట్ర మంత్రి అయ్యారు. తర్వాత రేవంత్ రెడ్డి ఏకంగా సీఎం అయ్యారు. దీంతో ఈ స్థానం నుంచి గెలిచిన అభ్యర్థులకు అదృష్టం కలిసొస్తుందనే సెంటిమెంట్ ఏర్పడింది.


2024లో పోరు ఇలా..


2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వగా.. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో నిలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌తోపాటు గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఈటల రెండు చోట్లా ఓడిపోయారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ముగ్గురు కూడా పార్టీ మారిన నేతలే. ఈటల బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి, సునీతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారారు. ఇక.. రాగిడి లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి మారారు.


ఓటర్లు..


మల్కాజిగిరి లోక్ సభ స్థానం పరిధిలో 37,80,453 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 19,45,624 మంది పురుషులు కాగా.. 18,33,430 మంది మహిళలు, 542 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. మల్కాజిగిరిలో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు లక్ష మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. 


Read more; Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..


2019 ఫలితం


2019 ఎన్నికలలో, కాంగ్రెస్‌కు చెందిన ఎ రేవంత్ రెడ్డి - ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి - కేవలం 10,000 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు, మొత్తం ఓట్లలో 38.63% సాధించారు. ఆయన సమీప పోటీదారు మర్రి రాజశేఖర్ రెడ్డి 37.93% ఓట్లను సాధించారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter