LRS application last date: హైదరాబాద్‌ : ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుకు తుది గడువు నేటి గురువారంతో ముగియనుండగా.. తాజాగా ఆ గడువును నెలఖారు (31వ తేదీ) వరకు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ ( Telangana govt ) నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు ( Heavy rains and floods ) కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటం, ఇంటర్‌నెట్‌ సేవలు నిలిచిపోయిన కారణంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించాల్సిందిగా కోరుతూ ప్రజల వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఇప్పటివరకు 19.33 లక్షల దరఖాస్తులు ( LRS applications ) వచ్చాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.  Also read : Uppal MLA Bethi Subhas Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, 2015లో ఎల్ఆర్ఎస్ పథకం కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. అప్పటి ఎల్ఆర్ఎస్ పథకంలోని నిబంధనలు, షరతులు ఇప్పుడు అన్ని ఒకేవిధంగా ఉన్నందున పెండింగ్‌ దరఖాస్తులను ప్రస్తుత ఎల్‌ఆర్‌ఎస్‌ పరిగణనలోకి తీసుకునేందుకు మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సంబంధిత అధికారులకు అనుమతి ఇచ్చారు.


ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం పాత దరఖాస్తులను కూడా పరిశీలించాలని సూచిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌, కుడా వైస్‌ చైర్మన్‌ సహా అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ సోమవారమే ఉత్తర్వులు జారీచేశారు. Also read : Sabarimala temple: అయ్యప్ప భక్తులకు ముఖ్య గమనిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe