Land Regularisation Scheme |  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ విధానం అమలులోకి వచ్చాక భూముల క్రమబద్ధీకరణ పథకం (LRS) స్కీమ్ తీసుకొచ్చింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనధికారిక లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ జరగాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఎల్ఆర్ఎస్ తుది గడువు (LRS last date In Telangana) నేటి (అక్టోబర్ 15)తో ముగియనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గమనిస్తే.. ఎల్ఆర్ఎస్ తుది గడువును పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిక్కుల్లో పడకూడదంటే నేడు ఎల్ఆర్ఎస్ చేసుకోవడం ఉత్తమం.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


అక్టోబర్ 14 సాయంత్రం వరకు 16,28,844 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇందులో గ్రామ పంచాయతీల పరిధిలో 6,67,693 ద‌ర‌ఖాస్తులు, మున్సిపాలిటీల్లో 6,70,085, కార్పొరేషన్‌ల పరిధిలో 2,91,066 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. కరోనా వ్యాప్తి సమయంలో, ప్రస్తుతం వర్షాల దెబ్బకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఈ సమయంలో ఎల్ఆర్ఎస్ అవసరమా అని ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe