దిశపై సామూహిక అత్యాచారం జరిపి దారుణ హత్యకు పాల్పడిన ఘటనలో కేసు దర్యాప్తు దశలో ఉండగానే షాద్‌నగర్‌కి సమీపంలోని చటాన్‌పల్లి కల్వర్టు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో అదే కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మృతిచెెందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నలుగురు నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపరిచేందుకు అవసరమైన వసతులు లేవని తమ పిటిషన్‌లో పేర్కొన్న పోలీసులు.. ఇప్పటికే మృతదేహాలు కుళ్లిపోయాయని తెలిపారు. మరోవైపు కుటుంబసభ్యులు కూడా తమ వారి మృతదేహాలను తమకు అప్పగించాలని కోరుతున్నారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేస్తే.. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలున్నందున వెంటనే ఇక్కడి నుంచి మృతదేహాలను తరలించేలా ఆదేశాలివ్వాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ హై కోర్టుకు విజ్ఞప్తిచేశారు. మృతదేహాలు కుళ్లిపోతున్నాయని చెప్పడంతో పాటు మహబూబ్ నగర్ ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపరిచేందుకు అవకాశాలు లేవని విన్నవించినందున.. హై కోర్టు నుంచి ఏ క్షణంలోనైనా ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో సీజేఐ అరవింద్ బాబ్డే కీలక వ్యాఖ్యలు


చటాన్‌పల్లి కల్వర్టు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నలుగురు నిందితుల మృతదేహాలను డిసెంబర్ 9వ తేదీ వరకు వారి కుటుంబసభ్యులకు అప్పగించరాదని, అంతిమ సంస్కారాలు నిర్వహించరాదని హైకోర్టు జారీ చేసిన ఆదేశాల కారణంగా ప్రస్తుతం ఆ నలుగురి మృతదేహాలు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండిపోయాయి. Read also : దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై సినీ ప్రముఖులు ఎవరేమన్నారంటే