Groom died hours before Wedding: మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మరో మూడు గంటల్లో పెళ్లి అనగా వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతను ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వరుడి మృతితో పెళ్లి జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన భువనాల చైతన్య (35) నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవలే వనపర్తికి చెందిన అమ్మాయితో చైతన్యకు వివాహ నిశ్చితార్థం జరిగింది. గురువారం (ఫిబ్రవరి 10) ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో ఉదయం 8గం. సమయంలో చైతన్య ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి కారులో బయటకెళ్లాడు.


జడ్చర్ల వైపు వెళ్తుండగా నక్కలబండ సమీపంలోని రోడ్డు మలుపు వద్ద చైతన్య ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో చైతన్య తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చైతన్య మృతి విషయం తెలిసి పెళ్లి ఏర్పాట్లలో ఉన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు షాక్‌కి గురయ్యారు. ఒక్కగానొక్క కుమారుడు పెళ్లికి కొద్ది గంటల ముందు చనిపోవడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు.


Also Read: MLC Ashok Babu Arrest: అర్ధరాత్రి ఎమ్మెల్సీ అశోక్ బాబును అరెస్ట్ చేసిన సీఐడీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook