Uddhav Thackeray invites KCR to Mumbai: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ఆహ్వానం మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 20న ముంబైకి వెళ్లనున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పరచడంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో బుధవారం ఉద్దవ్ ఠాక్రే... సీఎం కేసీఆర్‌కు (CM KCR) ఫోన్ చేశారు. దేశం కోసం కేసీఆర్‌ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు ఉద్దవ్. ఈ మేరకు ముంబయి వచ్చి.. తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కేసీఆర్ ను ఆహ్వానించారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న కేసీఆర్ కు అండగా ఉంటామన్నారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు చేస్తున్న పోరాటానికి.. దేశ ప్రజలందరినీ ఐక్యం చేయడంలో మా వంతు సహకారాన్ని అందిస్తామని ఉద్దవ్ అన్నారు. 


ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా  విపక్ష పార్టీలను ఏకం చేస్తున్న కేసీఆర్‌కు మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవేగౌడ (H D Deve Gowda) ఇటీవల మద్దతు ప్రకటించారు. దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ సీఎంను దేవేగౌడ‌ అభినందించారు.  


Also Read: KTR on Modi: మోదీపై కేటీఆర్ సెటైర్.. 'జాబ్స్' గురించి అడిగితే తెర పైకి 'హిజాబ్'..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook