Mallareddy Hospital: అధికారం ఉన్నా లేకపోయినా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యవహార శైలే వేరు. ఆయనకు ఎన్నో ఆస్పత్రులు, విద్యాసంస్థలు ఉన్న విషయం తెలిసిందే. అయితే తమ ఆస్పత్రుల్లో ఇకపై ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తామని మల్లారెడ్డి ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. మల్లారెడ్డి వారసులు హైదరాబాద్‌ ప్రజలకు ఈ శుభవార్త వినిపించారు. హైదరాబాద్‌ నగర ప్రజలందరూ తమ ఆస్పత్రిలో ఉచిత వైద్య సేవలు పొందవచ్చని.. దీనికోసం ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sharmila Letter: జగనన్న, బాబుకు షర్మిల పిలుపు.. కేంద్రంపై రండి కొట్లాడుదామని ఆహ్వానం


హైదరాబాద్‌ మాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లారెడ్డి ఆస్పత్రుల చైర్మన్ భద్రారెడ్డి, వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి (మల్లారెడ్డి కుమారుడు, కోడలు) మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలను వెల్లడించారు. పద్నాలుగు సంవత్సరాలు మల్లారెడ్డి ఆస్పత్రి ఉచిత వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. అయితే  ఈ సేవలు గతంలో మేడ్చల్, మల్కాజగిరి, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీగర్ నియోజకవర్గ ప్రజలు మాత్రమే ఉపయోగించుకునే వారని చెప్పారు. ఇకపై హైదరాబాద్ ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తామని వారు ప్రకటించారు. ఈ ఉచిత సేవలు కొద్ది రోజులు కాదని నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.

Also Read: AP TET Notification 2024: ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల, రేపట్నించి దరఖాస్తుల స్వీకరణ


వైద్య సేవలు కావాల్సిన ప్రజలందరూ మేడ్చల్‌లోని  మల్లారెడ్డి ఆస్పత్రికి రావాలని భద్రారెడ్డి, ప్రీతి రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగర ప్రజలకు పూర్తిగా అన్ని విభాగాలలో వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. సాధారణ వైద్యంతోపాటు సర్జరీ, గైనకాలజీ విభాగం తరపున ఇప్పటికే ప్రసూతి సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇకపై తమ ఆస్పత్రిలో అమ్మాయి పుడితే రూ.5 వేల డీడీతోపాటు కేసీఆర్‌ కిట్ మాదిరి సీఎంఆర్ కిట్‌ను ఇస్తామని వెల్లడించారు.


తమ ఆస్పత్రిలో చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య సదుపాయాలు ఉన్నాయని ప్రీతి రెడ్డి తెలిపారు. చిన్నారులకు వచ్చే వ్యాధులతోపాటు ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులకు, మెదడు, చర్మ ఆర్థో పెడిక్, కంటి, ఈఎన్‌టీ వంటి అన్ని విభాగాల్లో ఉచిత వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకోవచ్చని సూచించారు. అధునాతనమైన వైద్య సౌకర్యాలు, నిపుణులైన వైద్యులతో తమ ఆస్పత్రి ప్రజలకు ఉచిత సేవలు అందిస్తోందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు రమణి, విశ్వేశ్వర శాస్త్రి,సిద్దప్ప గౌరవ్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook