Complaint On Dog: పోలీస్ స్టేషన్ కు ఓ వ్యక్తి వచ్చాడు. చేతిలో కాగితం పట్టుకుని రావడంతో ఫిర్యాదు చేయడానికి వచ్చారని పోలీసులు భావించారు. పీఎస్ కు వచ్చిన సదరు వ్యక్తి కూడా తన చేతిలో ఉన్న ఫిర్యాదు కాపీని అక్కడున్న పోలీసులకు ఇచ్చాడు. అది తీసుకున్న పోలీసులు.. ఆ ఫిర్యాదును చదివారు. తర్వాత అవాక్కయ్యారు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. పోలీసులు ఎందుకు షాకయ్యారు... ఆ ఫిర్యాదులో ఏముందో తెలుసా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుక్క పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఆ వ్యక్తి. మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని  బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన ధారవత్ పూల్య నాయక్ ఈ ఫిర్యాదు ఇచ్చాడు. తనను ప్రతీ సారి గూడూరు మండలంలో వ్యవసాయ శాఖ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ కుక్క కరవడం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.కుక్కను పెంచుకున్న వ్యక్తి  పై కఠిన చర్యలు తీసుకోవాలని గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు పూల్య నాయక్. ఈ ఫిర్యాదు ను చూసి అవాక్కయ్యారు పోలీసులు.  


ఫిర్యాదు ఇచ్చిన ధారవత్ పూల్య నాయక్ తో మాట్లాడిన పోలీసులు.. కుక్కను పెంచుతున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. కుక్క ఎవరిని కరవకుండా చూడాలని ఆదేశించారు. కుక్క కరిచిన దారవత్ పూల్య నాయక్ ను చికిత్స  చేసే బాధ్యతను ఓనర్ కు అప్పగించారు గూడురు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా చర్చగా మారింది.


READ ALSO: Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు టీడీపీ షాక్.. అతిగా ఊహించుకోవద్దని గోరంట్ల సెటైర్


READ ALSO: Hyderabad Gang Rape: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు? గ్యాంగ్ రేప్ ఘటనలో సంచలన విషయాలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook