Man harassed a woman the name of cid officer in hyderabad: తాను సీఐడీలో పెద్ద ఆఫీసర్‌‌ను అంటూ ఓ మహిళను వేధించాడు అతను. నువ్వు ఇష్టమని చెబితే నన్నే కాదంటావా.. నువ్వు నాకు కావాలి.. అంటూ మహిళను లైంగికంగా ఇబ్బందులపెట్టాడు. ఈ ఘటన రాచకొండ పరిధిలో తాజాగా వెలుగు చూసింది. బాధితురాలి(30) ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మండలానికి చెందిన బాధితురాలికి గత నెల 29న కొత్త నంబర్‌ నుంచి వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. తర్వాత కొద్దిసేపటికే వరుసగా వీడియో కాల్స్‌ వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్ను ఒక వేడుకలో చూశాను... నువ్వు నాకు బాగా నచ్చావు... నీతో గడపాలని ఉంది... నేను నీకోసం ఎక్కడికి రమ్మన్నా వస్తాను అంటూ అసభ్యకరంగా మెసేజ్ చేశాడు ఆమెకు. అలా నిత్యం వేధించడం మొదలు పెట్టాడు ఆ ప్రబుద్దుడు. 


Also Read : Sania Mirza Supports Pakistan:సానియామీర్జా భారత పౌరసత్వాన్ని రద్దు చేయండి..ట్రోలింగ్


అంతేకాదు రోజూ అసభ్యకరమైన ఫొటోలు, (Obscene photos) వీడియోలు పంపేవాడు. దీంతో బాధితురాలు అసలు నువ్వెవరు.. ఎందుకిలా చేస్తున్నావంటూ అతన్ని నిలదీసింది. తాను సీఐడీలో పెద్ద ఆఫీసర్‌‌ని అంటూ చెప్పేవాడు. అంతేకాదు పోలీస్‌ యూనిఫారంలో (Police uniform) వీడియో కాల్‌ (Video call‌) కూడా చేశాడు. దీంతో ఆమె భయపడి ఆ నంబర్‌ను బ్లాక్‌ లో పెట్టింది. తర్వాత మరో నంబర్‌ నుంచి సేమ్ మెసేజ్‌లు, వీడియో కాల్స్‌ రావడం స్టార్ట్ అయ్యింది. నా నంబర్‌నే బ్లాక్‌ చేస్తావా..అంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు (Police) కేసు (Case) నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Also Read : Crime News: రూ.2 వేల కోసం స్నేహితుడి హత్య


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook