Telangana Rains: మాండౌస్ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో మరో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు!
Light rains will continue in Telangana due to Cyclone Mandous. మాండౌస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Rains to hits Telangana for more 2 days due to Cyclone Mandous: మాండౌస్ తుపాను ఎఫెక్ట్ ఏపీపై భారీగానే పడింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం చిత్తూరు జిల్లాలు జలమయం అయ్యాయి. అయితే భారీ వర్షాలు ఆదివారం కాస్త తగ్గుముఖం పట్టాయి. వర్ష ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలు చేపట్టడంతో భారీ నష్టం వాటిల్లలేదు. వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాలేదు.
మరోవైపు మాండౌస్ తుపాను ఎఫెక్ట్ తెలంగాణపై కూడా ఉంది. ఆదివారం హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘవృతం అయి.. అప్పుడప్పుడు చిరు జల్లులు కురిశాయి. ఈ చిరు జల్లులతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. నిన్న ఆదివారం అయినా చలి విపరీతంగా ఉండడంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. పనుల కోసం బయటికొచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేటి ఉదయం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి.
మాండౌస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో తూర్పు ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి సాయంత్రానికి వాయుగుండంగా.. ఆదివారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారిందన్నారు. ప్రస్తుతం అల్పపీడనం కూడా బలహీనపడిందని చెప్పారు. వర్షం, చలి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: Gold Price Today: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Delhi Liquor Scam: 7 గంటలసేపు విచారించిన సీబీఐ, కవిత స్టేట్‌మెంట్ రికార్డ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.