Mangapeta Village Unity: ప్రభుత్వసాయం కోసం వేచిచూడని మంగపేట గ్రామస్తులు..!
Mangapeta Village Unity: ఆ గ్రామస్తుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పదేళ్ల క్రితం ఓ సమస్యకు పరిష్కారం దొరికింది అనుకునేలోపే.. మరో సమస్య వచ్చిపడింది. కష్టాలకు కలత చెందకుండా.. గ్రామస్తులందరూ కలిసి మెదడుకు పని పెట్టారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా.. ఆ సమస్యకు చెక్ పెట్టారు. మరి.. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడిది.. ఆ గ్రామస్తుల కష్టాలు ఏంటీ?
Mangapeta Village Unity: ఆ గ్రామస్తుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పదేళ్ల క్రితం ఓ సమస్యకు పరిష్కారం దొరికింది అనుకునేలోపే.. మరో సమస్య వచ్చిపడింది. కష్టాలకు కలత చెందకుండా.. గ్రామస్తులందరూ కలిసి మెదడుకు పని పెట్టారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా.. ఆ సమస్యకు చెక్ పెట్టారు. మరి.. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడిది.. ఆ గ్రామస్తుల కష్టాలు ఏంటీ?
కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండల పరిధిలో ఉంటుంది మంగపేట గ్రామం. ఈ గ్రామానికి ఉన్న రహదారిలో రైల్వే ట్రాక్ ఉంది. దీంతో మంగపేట గ్రామస్తులు ఏ ఊరికి వెళ్లాలన్న అరిగోస పడేవారు. దీంతో పదేళ్ల క్రితం రైల్వేశాఖ.. మంగపేట వాసుల కోసం ప్రత్యేకంగా ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చింది. అయితే గ్రామానికి అనుకుని రహదారి ఉన్నప్పటికీ.. గ్రానైట్ లారీల రాకపోకలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు ఆ రహదారిని ఉపయోగించడం మానేశారు. రైల్వేశాఖ నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచే రాకపోకలు సాగిస్తూ వస్తున్నారు. అది బైక్ అయినా సరే.. కాలి నడకన అయినా సరే.. గ్రామానికి చేరుకోవాలంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఒక్కటే దిక్కు.
ఇక గత నాలుగేళ్ల నుంచి మంగపేట గ్రామస్తులకు మరో చిక్కువచ్చి పడింది. ఈ సారి సమస్య.. నీటి రూపంలో వచ్చింది. గంగాధరలోని ఎల్లమ్మ చెరువును కాళేశ్వరం జలాలతో నింపుతున్నారు. దీంతో చెరువు బ్యాక్ వాటర్ గ్రామంలోకి చొచ్చుకువస్తున్నాయి. వ్యవసాయభూములు, కొన్ని ఇళ్లు ఇప్పటికే చెరువు ముంపునకు గురయ్యాయి. ఎంతసేపు చెరువును నింపడంపైనే దృష్టి సారించిన అధికారులు.. గ్రామస్తుల సమస్యపైన ఫోకస్ పెట్టలేకపోయారు. ముంపునకు గురవుతున్న కుటుంబాలకు పరిహారం అందించకపోవడంతో వారి కష్టాలు అన్నీఇన్నీ కావు. బ్యాక్ వాటర్ తో గ్రామంలోకి పాములు, తేళ్లు వస్తున్నాయి. దీంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. తమ గ్రామానికి ముంపు గ్రామంగానైనా ప్రకటించి పరిహారం అందిస్తే మరో ఏరియాకు వెళ్తామంటున్నారు గ్రామస్తులు. దాదాపుగా 90 ఎకరాల వ్యవసాయ భూములు కోల్పోయిన రైతులు.. పరిహారం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.
కండ్లుకాయలు కాసేలా ఎదురుచూసినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. కనీసం ఓ అధికారి అయినా వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన పాపానపోలేదు. ఇవన్నీ చూసిన గ్రామస్తులకు ఇక ఓపిక నశించింది. అందరం కలిసికట్టుగా కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ కష్టాలనుంచి గట్టెక్కమని నిర్ణయానికొచ్చారు. ప్రతినిత్యం టెన్షన్ తో బతకడం కంటే.. కొంతకాలం కష్టపడితే భవిష్యత్ ఉంటుందని గ్రహించారు. ఈ నేపథ్యంలోనే మంగపేటకు అర కిలో మీటర్ దూరంలో ఓ గుట్టను గుర్తించారు. ఆ గుట్టను చదును చేసుకుని ఇండ్లు నిర్మించుకోవాలని నిర్ణయించారు. వెంటవెంటనే ఇందుకు కావాల్సిన నిధులు, ప్రణాళికను అందరూ కలిసికట్టుగా డిసైడ్ చేశారు. ఇంకేముంది గుట్టను తవ్వి చదును చేసే పనిలో గ్రామస్థులంతా నిమగ్నం అయ్యారు. 60 లక్షల రూపాయలు సొంతంగా జమ చేసుకున్న మంగపేట గ్రామస్తులు వడివడిగా తమ లక్ష్యంవైపుగా అడుగులు వేస్తున్నారు. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గుట్ట సమీపంలో కొంతమంది ఇండ్లు నిర్మించుకున్నారు.
మరికొంత స్థలాన్ని రైల్వే స్టేషన్, ప్రభుత్వ పాఠశాల, గ్రామపంచాయతీ భవనానికి కేటాయించారు. మిగతా ప్రాంతాన్నంతా చదును చేస్తే 13 ఎకరాల వరకూ ఉంటుందని ఈ స్థలంలో 30 కుటుంబాలకు ఇండ్లు నిర్మించుకునే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. గుట్టపై ఇండ్ల నిర్మాణంతో బ్యాక్ వాటర్ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరికినట్టు అవుతుందని ముంపునకు గురవుతున్న కుటుంబాల ప్రజలు చెబుతున్నారు. అటు విషకీటకాల బారి నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుందన్నారు.
మొత్తంగా మంగపేట గ్రామం మరెన్నో గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రభుత్వం స్పందింస్తుందోమోనని ఎదురుచూడకుండా అందరూ ఐక్యమై గుట్టను చదును చేసినతీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Pietersen on Kohli: విరాట్ కోహ్లీ చీకటి ప్రదేశంలో ఉన్నాడు.. ఇది మంచింది కాదు: పీటర్సన్
Also Read: Navneet Kaur: ఎంపీ నవనీత్ కౌర్‌కు వీఐపీ భద్రత..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.