వరంగల్: ఆర్టీసీలో నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు అగ్ర నేత జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆర్టీసీకి బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఆర్టీసి నష్టాల్లో కూరుకుపోయిందని అన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలనే కుట్రతోనే సర్కార్ ఆర్టీసి కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. ఆర్టీసి కార్మికులు తమ డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మె విరమించొద్దని వారికి జగన్ తన మద్దతు తెలిపారు. 


ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతుందని స్పష్టంచేసిన జగన్.. డిమాండ్ల సాధన కోసం అవసరమైతే, మిలిటెంట్ ఉద్యమాలు సైతం చేయాలని పిలుపునిచ్చారు.