Etela Rajender land grabbing issue: హుజురాబాద్ (Huzurabad) ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జా అంశం మరోసారి తెర పైకి వచ్చింది. కబ్జా అంశాన్ని గతంలోనే ధ్రువీకరించిన మెదక్ కలెక్టర్ హరీశ్ (Medak Collector) తాజాగా ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం (డిసెంబర్ 6) మీడియాతో మాట్లాడిన కలెక్టర్ హరీశ్... భూకబ్జాకు సంబంధించి పలు ఆసక్తికర వివరాలు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈటల కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ సంస్థ (Jamuna Hatcheries) అసైన్డ్ భూములను కబ్జా చేయడం వాస్తవమేనని కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. మెదక్ (Medak) జిల్లాలోని మాసాయిపేట మండ‌లం అచ్చంపేట‌, హ‌కీంపేట్ ప‌రిధిలో మొత్తం 70.33 ఎకరాలను జమునా హేచరీస్ కబ్జా చేసినట్లు సర్వేలో తేలిందన్నారు. మొత్తం 56 అసైనీల భూములను కబ్జా చేశారని పేర్కొన్నారు. హకీంపేట పరిధిలోని సర్వే నంబర్ 77-82, 130 హకీంపేట శివారులోని సర్వే నంబర్ 97, 111లో అసైన్డ్, సీలింగ్ భూముల కబ్జా జరిగిందన్నారు. ఈ భూములను ఎస్సీ, వంజర, ముదిరాజ్ కమ్యూనిటీలకు చెందినవిగా తెలిపారు.


కొన్ని సర్వే నంబర్లలోని భూముల్లో అక్రమంగా భారీ పౌల్ట్రీ షెడ్స్, ప్లాట్‌ఫామ్స్, రోడ్లను నిర్మించారని కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. అసైన్డ్ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారని... వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో చెట్లు నరికి రోడ్లు వేశారని అన్నారు. నిషేధిత జాబితాలోని భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమాలపై (Land grabbing allegations on Etela) ప్రభుత్వానికి నివేదిక పంపించామని తెలిపారు. అసైన్డ్ భూముల హక్కుదారులు తమ భూమి తమకు ఇవ్వాలని కోరారని... ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అక్రమాలకు పాల్పడినవారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు.


ఈటల రాజేందర్‌పై (Etela Rajender) భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తడం... ఆ వెంటనే ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించడం చకచకా జరిగిపోయిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ (CM KCR) ఉద్దేశపూర్వకంగానే తనపై కబ్జా ముద్ర వేసి మంత్రివర్గం నుంచి తొలగించారని ఈటల ఆరోపించారు. అవసరమైతే సిట్టింగ్ జడ్జితో తనపై విచారణ జరిపించాలని అప్పట్లో ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆ తర్వాతి పరిణామాల్లో టీఆర్ఎస్‌ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల (Etela Rajender) రాజీనామా చేయడం... హుజురాబాద్ ఉపఎన్నికలో గెలవడం జరిగిపోయాయి. అయితే భూకబ్జా ఆరోపణలు మాత్రం ఈటలను వెంటాడుతున్నాయి. తాజాగా మెదక్ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపిన నేపథ్యంలో సర్కార్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.


Also Read: AP New Capital: ఏపీ నూతన రాజధానిగా విశాఖ, ప్రకటన ఎప్పుడంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook