Medaram Jathara Celebrations: మేడారం జాతర వైభవంగా సాగుతోంది. సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున మేడారానికి తరలి వస్తున్నారు. సారలమ్మ గద్దెల పైకి చేరడంతో దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తాడ్వాయి మండలంలోని కన్నెపల్లి గుడిలో పూజలు పూర్తయ్యాక సారలమ్మను మేడారానికి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాహలం మధ్య సారాలమ్మ గద్దెలపైకి చేరుకుంది. సమ్మక్క భర్త పగిడిద్ద రాజు, సారలమ్మ, గోవిందరాజులు మేడారంలో గద్దెలపై కొలువుదీరారు. ఈ రోజు సమ్మక్క గద్దెలపైకి రానుంది. భక్తులతో గద్దెల ప్రాంగణం అంతా కిటకిటలాడిపోతోంది. 


భక్తులు జంపన్న వాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు బంగారాన్ని (బెల్లం) కానుకగా సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతరలో భాగంగా రెండో రోజు అంటే.. ఇవాళ సమ్మక్క కూడా గద్దెలపైకి వస్తుంది.. ఇక మూడో రోజున ఇద్దరు అమ్మవార్లూ భక్తులకు దర్శనమిస్తారు. నాల్గో రోజు సాయంత్రం కల్లా మళ్లీ వారిని యధా స్థానానికి తీసుకెళ్తారు.


గద్దెలే గర్భ గుళ్లుగా  కొలువుదీరుతోన్న సమ్మక్క.. సారలమ్మ అమ్మవార్ల జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అశేష భక్త జనం మేడారానికి వస్తున్నారు. కాలి నడకన.. ఎద్దుల బండ్లలో.. బస్సులు ఇతర వాహనాల్లో భక్తులు భారీగా మేడారానికి వస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో జరుగుతోన్న ఈ సంబురం కనులపండువగా ఉంది. 


తెలుగు రాష్ట్రాలతో పాటు  ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రకృతే దైవంగా భావించి సాగుతోన్న ఈ మహా జాతర ఆదివాసీలది అయినప్పటికీ.. లక్షలాదిమంది గిరిజనేతర భక్తులతోనే మేడారం కిటకిటలాడుతోంది.


మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం బేగంపేట ఎయిర్‌ పోర్ట్ నుంచి హెలికాప్టర్‌ సేవలు కూడా కొనసాగుతున్నాయి. ఈ సేవలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయి.


Also Read: CM KCR Birthday: 68వ వసంతంలోకి కేసీఆర్, ఘనంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు!


Also Read: CM KCR Birthday: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.. రక్తదానం చేసిన మంత్రి హరీష్ రావు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook