మేడారం సమ్మక్క సారక్క మినీ జాతర తేదీలు ఖరారు
మేడారం సమ్మక్క సారక్క మినీ జాతర తేదీలు ఖరారు
జయశంకర్ భూపాలపల్లి: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం సమ్మక్క సారక్క మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. 2019 ఫిబ్రవరి 20 నుంచి 23వ తేదీ వరకు ఈ జాతర జరుగుతుందని సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించే పూజారులు తెలిపారు. మేడారంలో సంవత్సరం తప్పించి మరో సంవత్సరం జాతర జరపడం సంప్రదాయం కాగా జాతర లేని సంవత్సరంలో మినీ జాతరను జరపడం మొదటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. అలా ప్రతీ ఏడాది జరిగే మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, ఒడిషా రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.