Medchal Rape Case: తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ కు వెళ్లే 15 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. పాఠశాల నుంచి ఆ బాలిక తిరిగి వస్తున్న క్రమంలో.. ఆమెకు డబ్బు ఆశ చూపి అత్యాచారం చేసినట్లు విచారణలో తేలింది. అయితే ఈ ఘటన మార్చి 31వ తేదీన జరగ్గా.. అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే?


గత నెల మార్చి 31వ తేదీన సదరు బాలిక తన స్నేహితురాళ్లతో కలిసి పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో బాలికకు పరిచయస్తుడైన ఆటో డ్రైవర్ అటుగా వచ్చాడు. తన ఇంటి వద్ద దిగబెడతానని ఆమెను నమ్మించి ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు. ఇదే విషయాన్ని ఆ బాలిక స్నేహితులు తర్వాతి రోజు స్కూల్ లో టీచర్ కు చెప్పడం వల్ల ఆ బాలికను ఆరా తీశారు. 


ఆటో డ్రైవర్ వెంకటయ్య డబ్బు ఎరగా చూపి తనపై అత్యాచారం చేసినట్లు ఆ బాలిక వెల్లడించింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులకు స్కూల్ టీచర్ ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు నమోదు చేశారు. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.  


Also Read: డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి మేనల్లుడు.. ప్రముఖ బీజేపీ నేత కుమారుడు... బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు


Also Read: Viral Video: కన్న కొడుకుని స్తంభానికి కట్టేసి.. కంట్లో కారం చల్లిన తల్లి! ఎందుకో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook