ఆ బావిలో మొత్తం 9 మృతదేహాలు.. అసలేం జరిగింది?
తొమ్మిది మంది సామూహికంగా బావిలో దూకి చనిపోవడంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందులో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం.
వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట విషాదం ఘటనలో నేడు మరో 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం మృతదేహాలు 9 మృతదేహాలను బావి నుంచి వెలికితీశారు. నిన్న నాలుగు మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికి తీయడం తెలిసిందే. తొమ్మిది మంది సామూహికంగా బావిలో దూకి చనిపోవడంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందులో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం.
ఎండీ మక్సూద్(50), ఆయన భార్య నిషా(45), కుమార్తె బుస్ర (20), మూడేళ్ల మనవడి మృతదేహాలను నిన్న వెలికితీయగా, నేడు లభ్యమైన 5 మృతదేహాల్లో మక్సూద్ కుమారుడు షాబాద్(22), బిహార్‌కు చెందిన కార్మికుడు శ్రీరామ్‌గా గుర్తించారు. మరొక మృతదేహం వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
గీసుకొండ మండలం గొర్రెకుంటలోని గన్నీ సంచుల గోదాంలో మక్సూద్ కుటుంబం పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో వీరు కనిపించడం లేదని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గురువారం అటుగా వెళ్తున్న వారు బావిలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిన్న రెస్క్యూ టీమ్ నాలుగు మృతదేహాలను వెలికితీసింది. ఇంకా గాలించగా నేడు తొలుత ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. అనంతరం మరో రెండు మృతదేహాలను వెలికితీశారు.
ఈ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సంఘటనా స్థలిని వరంగల్ సీపీ రవీందర్, మేయర్ ప్రకాశ రావు, కలెక్టర్ హరిత, అధికారులు పరిశీలించారు. కుటుంబ పెద్ద ఎండీ మక్సూద్ 20 ఏళ్ల కిందటే కుటుంబంతో సహా బతుకుదెరువు కోసం పశ్చిమ బెంగాల్ నుంచి వరంగల్‌కు వచ్చాడు. గొర్రెకుంటలో గన్నీ సంచుల తయారీగోదాంలో పనిచేసే వీరి కుటుంబం అనుమానాస్పదంగా చనిపోవడం స్థానికంగం కలకలం రేపుతోంది.
లాక్‌డౌన్ వల్ల రాకపోకలకు ఇబ్బంది అవుతుందని గత నెలన్నర రోజులుగా గోదాంలోనే 2 గదుల్లో మక్సూద్, భార్య, ఇద్దరు కుమారులు, భర్త నుంచి విడిపోయిన కూతురు బుస్ర ఆమె మూడేళ్ల కుమారుడు ఉంటున్నారు. వీరితో పాటు బిహార్ యువకులు శ్రీరాం, శ్యాం కూడా స్థానికంగా మరో గదిలో ఉంటున్నారు. ఒక్కసారిగా బావిలో శవాలుగా కనిపించారు. వరంగల్ నగరపాలక సంస్థ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృంద సభ్యులు, పోలీసులు కలిసి మృతదేహాలను తాళ్లతో వెలికితీశారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్