పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు
జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ అభివృద్ధిపై రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. జహీరాబాద్ మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆయన సూచించారు. మున్సిపాలిటీలోనే దాదాపుగా 35 కోట్లరూపాయల నిధులు ఉన్నాయని, అధికారులు నూతన ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని సూచించారు.
హైదరాబాద్ : జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ అభివృద్ధిపై రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. జహీరాబాద్ మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆయన సూచించారు. మున్సిపాలిటీలోనే దాదాపుగా 35 కోట్లరూపాయల నిధులు ఉన్నాయని, అధికారులు నూతన ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని సూచించారు. నిధులున్నపటికీ అభివృద్ధి కుంటుబడుతోందని, వాటిని అధికారులు ఎందుకు ఖర్చు చేయడం లేదని మంత్రి ప్రశ్నించారు. వెంటనే అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని అధికారులను కోరారు. అధికారులు అలసత్వం వహిస్తే సహించేదిలేదని అన్నారు.
మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులు అధికంగా సాగాలంటే పన్నులు వసూలు ముఖ్యమని, అధికారులు పన్నుల వసూళ్ల పెంపుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
మరోవైపు, మంత్రి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లాలు పెట్టి నీరు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూం ఇళ్లకు అర్హులైన లబ్ధిదారుల జాబితాను వెంటనేతయారు చేయాలని అధికారులను ఆదేశించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..