Harish Rao Review On Minority Welfare Schemes: రాష్ట్రంలోని ఇతర వర్గాలతో సమానంగా మైనారిటీ వర్గాల సంక్షేమంతోపాటు అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని  మంత్రి హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ మేరకు మైనార్టీల వివిధ సమస్యలపై చర్చించేందుకు సచివాలయంలో మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం, ఓవర్ సీస్ స్కాలర్ షిప్స్, స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్, మౌజం సంఖ్య పెంపు, క్రిస్టియన్ స్మశాన వాటికలు, ఆర్‌టీఎఫ్‌, ఎమ్‌టీఎఫ్‌ తదితర అంశాలపై చర్చించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. స్మశాన వాటికలకు 125 ఎకరాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్‌లు-మౌజిన్‌ల సంఖ్య పెంపు వంటి రెండు హామీలను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తుచేశారు. మైనార్టీల సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన 10 వేల మంది లబ్ధిదారులకు ఈ నెల 16 నుంచి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ ప్రారంభించాలని చెప్పారు.


సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే కేటాయించిన 270 కోట్లకు అదనంగా మరో 130 కోట్లు కేటాయించాలన్నారు హరీశ్ రావు. మొత్తం 400 కోట్లు ఈ కార్యక్రమం అమలుకు కేటాయించాలని ఆర్థిక శాఖను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారం ఆర్థిక సహాయం అందజేసుందుకు లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం జరగాలని సూచించారు. మైనారిటీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై మరింత దృష్టి సారించాలని చెప్పారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో స్మశాన వాటికలు, ఈద్‌గాల భూముల కోసం వచ్చిన మొత్తం వినతులను  పరిశీలించాలన్నారు.


ఈ దిశగా పనులు వేగవంతం చేయాలని అధికారులకు చెప్పారు.  ఒవైసీ పహాడీ షరీఫ్ దర్గా ర్యాంప్ పనులు, దర్గా బర్హనా షా అద్దెల సవరణ, క్రిస్టియన్ స్మశాన వాటికలు, ఆర్‌టీఎఫ్‌, ఎమ్‌టీఎఫ్‌ గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇతర పనులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. వాటికి అవసరమైన నిధులు విడుదల చేయాలని సూచించారు.


Also Read: Ind vs WI 3rd T20 Updates: విండీస్‌తో నేడే మూడో టీ20.. ఓడితే సిరీస్ గోవిందా..!  


Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి