Minister Harish Rao: కాంగ్రెస్‌కి, బీఆర్ఎస్ పార్టీకి ఇదే తేడానన్న మంత్రి హరీశ్ రావు
Minister Harish Rao: గ్యారంటీ, ష్యూరిటీ లేకుండా లక్ష రూపాయలు ప్రభుత్వం అందిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాటలు మాత్రమే చెబుతుంది కానీ చేతలు ఉండవు అని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కానీ మన ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రం ఏదైనా మాట ఇస్తే దాన్ని చేసి చూపిస్తున్నాడు. అందుకే అలాంటి సీఎం ను మళ్ళీ గెలిపించాలి అంటూ మంత్రి హరీశ్ రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Minister Harish Rao: సంగారెడ్డిలోని గోకుల్ గార్డెన్స్‌లో మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, జిల్లాలోని 17030 మంది దివ్యాంగులకు ప్రభుత్వం 4016 రూపాయలు దివ్యాంగుల పెన్షన్ అందిస్తోందని అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో రూ.700 పెన్షన్ అందిస్తుండగా, కర్ణాటకలో రూ 1000, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో రూ 600 పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు అని తెలిపారు. షాదీముబారక్ లాంటి స్కీం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించిన మంత్రి హరీశ్ రావు.. షాదీ ముబారక్ పథకం కోసం ప్రభుత్వం 2130 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది అని తెలిపారు.
గతంలో ఒక్కటి కూడా మైనారిటీ స్కూల్ లేని సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు 16 మైనారిటీ స్కూల్స్ ఏర్పాటు చేశాం. 70 ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. పేదల గురించి ఎప్పుడు ఆలోచించని కాంగ్రెస్ ఎప్పుడు పేదరిక నిర్ములన గురించి ఆలోచించలేదన్నారు. దేశం మొత్తంలో ఎన్ని మైనారిటీ స్కూల్స్ ఉన్నాయో.. ఒక్క తెలంగాణలోనే అంతకంటే ఎక్కువ ఉన్నాయి అని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో ముస్లింల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ లలో ముస్లింలకు లేని సౌకర్యాలు తెలంగాణ కల్పిస్తోంది.
గ్యారంటీ, ష్యూరిటీ లేకుండా లక్ష రూపాయలు ప్రభుత్వం అందిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాటలు మాత్రమే చెబుతుంది కానీ చేతలు ఉండవు అని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కానీ మన ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రం ఏదైనా మాట ఇస్తే దాన్ని చేసి చూపిస్తున్నాడు. అందుకే అలాంటి సీఎం ను మళ్ళీ గెలిపించాలి అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎక్కడున్నాడు.. ఆయన ఫోన్ నెంబర్ కూడా దొరకదు.. మరి ప్రజలకు ఎక్కడ కనిపిస్తాడు అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఎద్దేవా చేశారు.
సీఎం కేసిఆర్ ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఏర్పాటు చేసారు. 10 ఏళ్ళ పాటు అధికారంలో ఉన్నంత కాలం రైతుల గురించి ఆలోచించని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిక్లరేషన్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్కారు దవాఖాన పేరెత్తితే... నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అని అనేవారు.. కానీ ఇప్పుడు సర్కార్ దవాఖానకే జనం దారికట్టారు అని కాంగ్రెస్ పాలనకు , తమ పార్టీ పాలనకు మధ్య ఉన్న తేడాని మంత్రి హరీశ్ రావు వివరించే ప్రయత్నం చేశారు. రాబోయే ఎన్నికలు , ముఖ్యమంత్రి కేసీఆర్ సిఆర్ చేసిన అభివృద్ధి పనులు... కాంగ్రెస్ అబద్దాలకు మధ్య పోటీ ఓటర్లు ఆలోచన చేయాలి అని విజ్ఞప్తి చేశారు.