Harish Rao Inaugurates Super Specialty MCH: మాతా శిశు సంరక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా రూ.52 కోట్లతో నిర్మించిన 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ను, 33 నియోనాటల్ అంబులెన్స్‌లను ప్రారంభించడం, రూ.1.2 కోట్లతో ఆధునీకరించిన డైట్ కిచెన్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో ప్రారంభోత్సవ కార్యాక్రమం అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మాతా శిశు మరణాలను మరింత తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం 3 మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ (ఎంసీహెచ్‌) నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ఇందులో ఒకటి నిమ్స్‌లో, రెండోది అల్వాల్‌లో నిర్మిస్తున్న టిమ్స్‌ పరిధిలోది. కాగా మూడోది గాంధీ. మొత్తం 600 పడకలు మాతా శిశు సంరక్షణ కోసం అందుబాటులోకి వస్తాయి. ఈ మూడు సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ హాస్పిటల్స్‌లో మాతా, శిశువులకు అన్ని రకాల మల్టీపుల్‌ వైద్య సేవలు ఒకే చోట అందుబాటులో ఉండనున్నాయి. ప్రసవం సమయంలో, తరువాత.. మహిళలు ఎదుర్కొనే వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో పాటు పుట్టిన శిశువు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సేవలు ఈ ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో అందనున్నాయి. గర్భిణులకు డయాలసిస్‌ అవసరం పడితే ఉన్నచోటనే డయాలసిస్‌ అందించేందుకు ఎంసీహెచ్‌ హాస్పిటల్‌లోనే డయాలసిస్‌ కేంద్రాన్ని చేశాం. గుండె, కిడ్నీ, కాలేయం, న్యూరో తదితర మల్టిపుల్‌ వ్యాధులతో బాధపడే తల్లులకు, పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల సమస్యలతో బాధపడే శిశువులకు ఈ ‘మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌’ సెంటర్‌లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుతుంది.


వెంటిలేటర్లు, గుండె పరీక్షల కోసం 2డి-ఎకో యంత్రాలు,  కొల్పోస్కోపి, ల్యాపరోస్కోపి తదితర యంత్రాలను సైతం ఏర్పాటు చేశాం. ప్రస్తుతం గాంధీ దవాఖానాలో 300 పడకల సామర్ధ్యంతో ప్రసూతి విభాగం అందుబాటులో ఉంది. ఇందులో 200 పడకలు గర్భిణులు, స్త్రీ సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం కేటాయించగా, మరో 100 పడకలు చిన్నపిల్లల కోసం ఉన్నాయి. 


గాంధీ దవాఖానకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోగుల తాకిడి ఉంటుంది. కొత్తగా అందుబాటులోకి రానున్న 200 పడకల సామర్ధ్యం గల ఎంసీహెచ్‌ సూపర్‌స్పెషాల్టీ హాస్పిటల్‌తో మాతా, శిశువులకు మరింత మెరుగైన వైద్యం అందనుంది. ప్రస్తుతం దవాఖానాలో మాతా, శిశువుల కోసం ఉన్న 300 పడకలకు తోడు 200 పడకలు అదనంగా చేరాయి. అంటే ఒక్క గాంధీ లోనే 500 పడకలు మాతా, శిశు ఆరోగ్యం కోసం అందుబాటులో ఉంటాయి." అని హరీశ్ రావు చెప్పారు.


నవజాత శిశువులను అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు చేరవేసి తద్వారా సకాలంలో చికిత్స అందించేందుకు నియోనాటల్ అంబులెన్స్‌లను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన తెలిపారు. దూరప్రాంతాల నుంచి అత్యవసరం అయితే ఆసుపత్రికి చిన్నారులను చేరవేర్చడం కొంత ఆలస్యంగా ఉంటుందని.. దానికి పరిష్కారం ఇది అని చెప్పారు. పుట్టిన ప్రతి బిడ్డను కాపాడుకోవడం సాధ్యం అవుతుందని.. దేశంలో తొలి సారిగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. తల్లీబిడ్డల సంరక్షణ అత్యంత ప్రాముఖ్యమైన ప్రజారోగ్య అంశం అని. వారి ఆరోగ్యంపైనే కుటుంబం, సంఘం మరియు దేశ ఆరోగ్య స్థితిగతులు ఆధారపడి ఉంటాయన్నారు. తల్లి బాగుంటే ఇల్లు బాగుంటుందని.. పిల్లలు బాగుంటే భావి భారతం బాగుంటుందని అభిప్రాయపడ్డారు.  


Also Read:  IND vs IRE 2nd T20 Updates: ఐర్లాండ్‌తో రెండో టీ20.. మ్యాచ్‌ను ఎక్కడ చూడాలి..? పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!   


Also Read: Ketika Sharma: పొట్టి నిక్కర్‌లో బ్రో బ్యూటీ సందడి.. కేతిక శర్మ ఖతర్నాక్ పోజులు చూశారా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook