Doctors Joins in BRS Party: వైద్యులు తెలంగాణ భవన్‌లోకి వచ్చి పార్టీలో చేరడం గొప్ప విషయం అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఐఎంఎ స్టేట్ ప్రెసిడెంట్ బీఎన్ రావు, వివిధ జిల్లాల అధ్యక్షులు, వైద్యులు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్బంగా గులాబీ కండువా కప్పి మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. స్ట్రాంగ్ లీడర్ కావాలా..? రాంగ్ లీడర్ కావాలా..? అందరూ ఆలోచించాలని కోరారు. కేసీఆర్ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్రం సాధించారని.. తెలంగాణ పట్ల తనకున్న ప్రేమ మరెవ్వరికి ఉండదని అన్నారు. మిగతా రాజకీయ పార్టీలది పదవుల కోసం ప్రయత్నమని.. కానీ సీఎం కేసీఆర్ ఒక టాస్క్‌లాగా భావించి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"60 ఏండ్ల కరెంట్ కోతలు డాక్టర్లుగా మీరు చూశారు. తెలంగాణలో నేడు సుపరిపాలన అందుతోంది. నాడు ఎంబీబీఎస్ చదవాలంటే పక్క దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. నేడు తెలంగాణలో ఉంటూనే ఎంబీబీఎస్ చదివే అవకాశం. ప్రజలకు మంచి చేసే పనులు పత్రికల్లో ఎక్కువగా కనపడటం లేదు. కానీ ఎదుటి వారిని తిడితే వార్తల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పేపర్ లీడర్ కావాలా, ప్రాపర్ లీడర్ కావాలా ప్రజలు ఆలోచించాలి. హైదరాబాద్ హెల్త్ హబ్‌గా.. ఫార్మా హబ్‌గా.. ఐటీ హబ్‌ ఎదిగింది. ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1.. వైద్యులు ఉత్పత్తిలో నెంబర్ 1..


నాడు బెంగాల్ ఆచరిస్తే, దేశం అనుసరిస్తది అనే వారు, దాన్ని తిరగరాసింది తెలంగాణ. తెలంగాణ ఆచరిస్తే.. దేశం అనుసరిస్తది అనేంతగా అభివృద్ధి చేశాం. గ్రామీణ అవార్డుల్లో 38శాతం అవార్డులు తెలంగాణకే వచ్చాయి. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందించిన తెలంగాణ పథకాన్ని కేంద్రం హర్ ఘర్ కో జల్ అని కాపీ కొట్టింది. మేము మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేస్తే కేంద్రం అమృత్ సరోవర్ అని కాపీ కొట్టింది. దేశాన్ని రక్షించే సైనికులు, అన్నం పెట్టే రైతులకు, ప్రాణం కాపాడే వైద్యులకు ఎంతో విలువ ఉంది. అలాంటి రైతుల కోసం రైతు బంధు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది. రైతు బంధును పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అని కేంద్రం అమలు చేస్తుస్తోంది. అయితే మనం పది వేలు ఇస్తే, కేంద్రం మూడు వేలే ఇస్తున్నది.." అని మంత్రి హరీశ్ రావు అన్నారు. 


మిషన్ భగీరథ ద్వారా గొప్పమార్పు వచ్చిందని.. ప్రతి పథకం వెనుక సామాజిక కోణం దాగి ఉందన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్ వల్ల ఇనిస్టిట్యూషనల్ డెలివరీలు 100 శాతం అవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014లో 30 శాతం డెలివరీలు జరిగితే.. నేడు 72.8 శాతం జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఆంధ్రలో వంద ఎకరాలు వస్తాయని మొన్న చంద్రబాబు అన్నారని.. 9 ఏండ్ల తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో సీఎం కేసీఆర్ శ్రమ ఎంతో దాగి ఉందన్నారు. అందుకే స్ట్రాంగ్ లీడర్ చేతిలో రాష్ట్రం ఉండాలని.. రాంగ్ లీడర్ చేతిలో పెట్టొద్దని కోరారు. మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేసేందుకు అందరం కలిసి కట్టుగా కృషి చేద్దాని పిలుపునిచ్చారు.


Also Read: PM Modi Letter About Gaddar: మీ దు:ఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేం.. గద్దర్ భార్య విమలకు ప్రధాని మోదీ లేఖ  


Also Read: Virat Kohli: బీసీసీఐకి కోపం తెప్పించిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఆటగాళ్లందరికీ వార్నింగ్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook