Minister Harish Rao: ఏపీలో రెండు పార్టీలు నోరు మూసుకున్నాయి.. వైసీపీ, టీడీపీలకు మంత్రి హరీష్ రావు చురకలు
Harish Rao On Visakhapatnam Steel Plant: విశాఖ పరిశ్రమ విషయంలో వైసీపీ, టీడీపీ నోరుమూసుకున్నాయని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రజలు, కార్మికులు, బీఆర్ఎస్ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని అన్నారు. ఏపీ ప్రజలకు, కార్మికులకు అభినందనలు తెలిపారు.
Harish Rao On Visakhapatnam Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. కేసీఆర్, బీఆర్ఎస్ దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతుందని సీఎం కేసీఆర్ అన్నారని.. విశాఖ హక్కు గురించి తాను, కేటీఆర్ కూడా మాట్లాడామని గుర్తు చేశారు. విశాఖ ఉక్కును అడ్డికి పావు షేరు లెక్క అమ్ముతున్నారని.. 27 వేల మంది కార్మికులకు అన్యాయం చేస్తున్నారని తాము అన్నామన్నారు. వికారాబాద్ మర్పెల్లిలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. విశాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకెళ్లడం లేదని స్వయంగా కేంద్రమంత్రి ప్రకటించారని.. ఆర్‌ఎన్ఎల్‌ను బలోపేతం చేసే పనిలో ఉన్నామన్నారని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గిందన్నారు. ఆంధప్రదేశ్‌లో రెండు పార్టీలు నోరు మూసుకున్నాయంటూ వైసీపీ, టీడీపీలకు చురకలు అంటించారు. అధికార పక్షం నోరు మూసుకున్నా.. ప్రతిపక్షం ప్రశ్నించకపోయినా ప్రజలు, కార్మికులు, బీఆర్ఎస్ పోరాటం చేసిందన్నారు. అందుకే కేంద్ర దిగివచ్చిందని చెప్పారు. అయినా జాగ్రత్తగా ఉంటామని.. కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇది కేసీఆర్, బీఆర్ఎస్, ఏపీ ప్రజలు, నిరాహార దీక్ష చేస్తున్న విశాఖ కార్మికుల విజయమని అన్నారు. మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు, కార్మికులకు అభినందనలు తెలిపారు. అన్యాయానికి వ్యతిరేకంగా గులాబీ జెండా పోరాటం చేస్తుందని.. అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
బీఆర్ఎస్ సభ గురించి హరీష్ రావు మాట్లాడుతూ.. ఇది ఆత్మీయ సమ్మేళనంలా లేదని.. విజయోత్సవ సభ లాగా ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలకులు చేయంది.. సీఎం కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు ఇస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదని.. కేసీఆర్ ఒక పెద్ద కొడుకు లాగా ఆసరా పింఛన్లు ఇస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు నిరంతరంగా అమలు కావాలంటే సీఎం కేసీఆర్ పాలన మళ్లీ రావాలని అన్నారు. గులాబీ జెండా లేకుంటే ఇవన్నీ వచ్చేవా..? అని అడిగారు.
Also Read: WTC Final 2023: ఒకే ఒక్క ఇన్నింగ్స్.. అజింక్య రహానేకు బంపరాఫర్! సూర్యకు నో ఛాన్స్
'జెండాలు మారాయి, ప్రభుత్వాలు మారాయి కానీ ప్రజల బతుకులు మారలేదు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తా అని నాడు మోసం చేస్తే.. 2008లో రాజీనామా చేశాం. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు మా రంగారెడ్డి జిల్లాలో మా పిల్లలు చదువుకునేందుకు ఒక్క డిగ్రీ కాలేజీ లేదు. అప్పుడు ఎందుకు కలిసి ఉండాలి అన్నాను. కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేశాం కాబట్టి అప్పుడు డిగ్రీ కాలేజీ వచ్చింది. ఈరోజు కేసీఆర్ దీవెనతో వికారాబాద్‌కు మెడికల్ కాలేజీ వచ్చింది. 250 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. 600 పడకల ఆసుపత్రి వస్తది. 150 మంది డాక్టర్లు ఉంటరు. పెద్ద రోగం వస్తే హైదారాబాద్ దాకా పోవాల్సిన అవసరం లేదు. రెండు నెలల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు వస్తారు. మీకు సేవలు అందుబాటులోకి వస్తాయి..' అని హరీష్ రావు అన్నారు.
Also Read: Surya Kumar Yadav IPL: సూర్యకుమార్ యాదవ్ నువ్వో తోపు ప్లేయర్.. బ్యాట్‌తోనే సమాధానం చెప్పు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.