Minister Harish Rao: ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కోడికత్తి దాడి అంటూ అపహాస్యం.. మంత్రి హరీష్ రావు కౌంటర్.!
Harish Rao Updated MP Kotha Prabhakar Reddy Health Condition: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం కొంత నిలకడగా ఉందని తెలిపారు మంత్రి హరీష్ రావు. కోడికత్తి డ్రామాలు అంటూ కామెంట్స్ చేస్తున్న వారికి ఆయన కౌంటర్ ఇచ్చారు. చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao Updated MP Kotha Prabhakar Reddy Health Condition: కత్తిదాడితో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని మంత్రి హరీష్ రావు మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం కొంత స్థిరంగా ఉందని తెలిపారు. వైద్యులు నిరంతరం ఆరోగ్యం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. కొందరు నాయకులు కూడా చిల్లర కామెంట్స్ చేస్తున్నారని.. కోడికత్తి అని రాజకీయాలు అపహస్యం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి అలాంటి అవసరం లేదని స్పష్టం చేశారు. కడుపులో చిన్న పేగు నాలుగు చోట్ల రంధ్రాలు పడితే.. తొలగిస్తే ఇంత చిల్లర మాటలు మాట్లాడుతారా..? అని ఫైర్ అయ్యారు.
"ఖండించాల్సిన ప్రతిపక్షాలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాయి. దిగజారిపోయి మాట్లాడుతున్నాయి. 15 సెంటి మీటర్లు ఓపెన్ చేసి.. సర్జరీ చేసి పేగు కట్ చేసి తొలగించారు. ఈ రకంగా మాట్లాడటం దివాలకోరు రాజకీయం. పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాల్ డేటా సేకరించారు. వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఒకటి రెండు రోజుల్లో కుట్ర కోణం చేధిస్తారని ఆశిస్తున్నా.. తెలంగాణలో ఇలాంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చూడలేదు. ఇలాంటి హత్యా రాజకీయాలను రాయలసీమ, బీహార్‌లో చూశాం.." అని హరీష్ రావు అన్నారు.
ఇన్నేళ్ల చరిత్రలో ఎన్నికల సమయంలో ఇలా దాడులు లేవన్నారు. వ్యక్తులపై కేసులు పెట్టే ప్రయత్నం లేదని.. పనితనం తప్ప పగతనం లేని నాయకుడు కేసీఆర్ అని అన్నారు. అలా పగ ఉంటే ఇప్పటికీ ఎంతో మంది జైళ్లలో ఉండేవారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు హౌసింగ్ స్కామ్‌లో వందల కోట్లు మెక్కారని.. అందరినీ లోపల వేసేవాళ్లమని అన్నారు. అలాగే ఓటుకు నోటు కేసు ఉందని గుర్తు చేశారు. ఏనాడు ఇలాంటివి తాము పాల్పడలేదని.. ఏదేమైనా ఇలాంటివి జరగటం దురదృష్టకరని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని.. తెలంగాణ సమాజం ఎప్పటికీ ఇలాంటివి హర్షించదని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని.. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని చెప్పారు.
Also Read: Bail Conditions: బెయిల్ మంజూరు చేస్తూ చంద్రబాబుకు హైకోర్టు విధించిన షరతులు ఇవే
Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి