Minister Harish Rao Comments On BJP: బీజేపీ ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి హరీష్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. చౌటుప్పల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, జెడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌కు తొలి విజయం సిద్దిపేట.. బీఆర్ఎస్‌కు తొలి విజయం మునుగోడులో లభించిందన్నారు. ఎంత డబ్బు ఆశ చూపినా.. మునుగోడు ప్రజలు అభివృద్ధి కోసం చూశారని అన్నారు. అందుకే ఇక్కడికి 100 పడకల ఆసుపత్రి వచ్చిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రం అయినా తెలంగాణతో పోటీ పడగలదా..? అని అడిగారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మన పథకాలు ఉన్నాయా..? అని ప్రజలను అడిగారు మంత్రి హరీష్ రావు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు ఎందుకు రాలేదన్నారు. జానా రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక్కడే ఉన్నారు.. కానీ ఎందుకు మెడికల్ కాలేజీలు, బత్తాయి మార్కెట్, నిమ్మకాయ మార్కెట్ ఎందుకు రాలేదని నిలదీశారు. పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో కూడా రాజకీయం చేసే పార్టీ బీజేపీ అంటూ ఫైర్ అయ్యారు. పొద్దున వాళ్లే పేపర్ లీక్ చేసి.. మధ్యాహ్నం ధర్నా చేశారని అన్నారు. 


'మావి పథకాలు, పనులు అయితే.. బీజేపీవి కుట్రలు, పన్నాగాలు. బీజేపీ ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలది గన్ కల్చర్ అయితే.. మనది అగ్రికల్చర్.. నాలుగేళ్ల తర్వాత వచ్చి మోడీ ఎయిమ్స్‌కి భూమి పూజ చేశారు. 2014-15లో రూ.3392 కోట్లతో ధాన్యం సేకరిస్తే 2020-21 నాటికి రూ.26,600 కోట్లకు చేరుకుంది. ఎరువు బస్తాల కోసం చౌటుప్పల్‌లో చెప్పులు క్యూలో పెట్టేవారు. మేము వడ్లు కొనం అని కేంద్రం అంటే.. కేసీఆర్ గారు ప్రతి గింజ కొంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్త గొప్పగా చెప్పుకునే రోజు వచ్చింది. అన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి..' అని హరీష్ రావు సూచించారు. 


Also Read: Karnataka Assembly Elections: చదివింది తొమ్మిదో తరగతి.. రూ.1,609 కోట్లకు అధిపతి.. మంత్రి ఆస్తుల వివరాలు వెల్లడి


అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత నల్గొండ తల రాత మారిందన్నారు. రైతన్న సంతోషంగా ఉంటున్నాడంటే సీఎం కేసీఆర్ వల్లేనని అన్నారు. నాడు అన్నమే లేని జిల్లా.. నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పథకాలు చేరువ అయ్యాయన్నారు. గుజరాత్‌తో సహా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇక్కడి పథకాలకు డిమాండ్ పెరిగిందన్నారు. హస్తినా పీఠం కదులుతుందన్న బెంగ బీజేపీకి పట్టుకుందని అన్నారు. 


Also Read: OPS Latest Update: ఉద్యోగులకు తీపికబురు.. ఓపీఎస్‌ అమలుకు నోటిఫికేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook