Minister Harish Rao Vs Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న వేళ రైతుబంధుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నికల సంఘం.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ 28వ తేదీలోపు రైతుబంధుకు పంపిణీ చేసేందుకు పర్మిషన్ ఇచ్చిన ఈసీ.. తాజాగా ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతుబంధు గురించి మాట్లాడవద్దని.. లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయకూడదని ఈసీ ముందే షరతులు విధించింది. అయితే మంత్రి హరీశ్‌రావు రైతుబంధుపై చేసిన కామెంట్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఈసీ బ్రేక్ వేసింది. ఈ మేరకు తాజాతగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 70 లక్షల మంది రైతులకు 'రైతుబంధు' ఆగిపోనుంది. రైతుబంధును ఈసీ నిలిపివేయడంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుబంధు రైతుల ఖాతాలో వేయాలని ఈసీకి తాము విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఈసీ అనుమతి ఇచ్చినా.. హరీష్ రావు నోటిదూల, కేసీఆర్ అతి తెలివి వల్ల రైతుబంధు నిలిచిపోయిందన్నారు. రైతుల ఖాతాల్లో పడాల్సిన రూ.5 వేల కోట్లు ఆగిపోయాయన్నారు. రైతులకు విజ్ఞప్తి చేస్తున్నానని.. రైతుబంధు రాకపోవడానికి కారణమైన బీఆర్‌ఎస్ నేతలను తరిమికొట్టాలని కోరారు. బీఆర్ఎస్ కుట్ర వల్లే రైతుల ఖాతాలో పడాల్సిన నిధులు ఆగిపోయాయని చెప్పారు. అల్లుడు హరీష్ వల్లే రూ.5 వేల కోట్లు నిలిచిపోయాయని.. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నవంబర్ 30న అల్లుడు హరీష్‌కు.. మామ కేసీఆర్‌కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఏటా ప్రతీ ఎకరాకు రూ.15 వేలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌దేనని హామీ ఇచ్చారు. 
 
రైతు బంధుపై కాంగ్రెస్ కుట్ర మరోసారి బయటపడిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతులకు పంట సాయం పంపిణీ చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ కుట్ర చేసిందని ఆరోపించారు. టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ రైతు బంధుపై ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే నిర్ణయం తీసుకుందన్నారు. రైతుబంధును కాంగ్రెస్ పార్టీనే ఆపింది అనడానికి ఇదే నిదర్శనమన్నారు. రైతులారా.. తెలంగాణ ప్రజలారా.. కాంగ్రెస్ కుట్రలను అర్థం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రైతులతో కేసీఆర్‌ది ఓటు బంధం కాదని.. పేగుబంధమన్నారు. డిసెంబర్‌ 3 వరకు రైతుబంధును కాంగ్రెస్‌ ఆపగలదని.. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ రైతుబంధు ఇస్తారని చెప్పారు.


Also Read: IPL 2024 Purse Details: ముగిసిన రిటెన్షన్ ప్రక్రియ, ఏ జట్టు పర్సులో ఎంత ఉందో తెలుసా.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook