Minister Indrakaran Reddy on Governor: తెలంగాణ సర్కార్ తనను అవమానిస్తోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ పెద్దల నుంచి కౌంటర్స్ పడుతున్నాయి. గవర్నర్ తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఫైర్ అవగా... తాజాగా మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గవర్నర్‌కు కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ తమిళిసై హుందాగా వ్యవహరిస్తే ఆమెకు గౌరవం ఉంటుందని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాదాద్రి పర్యటనలో ప్రోటోకాల్ పాటించలేదన్న గవర్నర్ విమర్శలను ఇంద్రకరణ్ రెడ్డి కొట్టిపారేశారు. యాదాద్రి పర్యటనకు కేవలం 10 నిమిషాల ముందు సమాచారమిస్తే ప్రోటోకాల్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇప్పటివరకూ గవర్నర్లుగా వచ్చినవారంతా ఐఏఎస్, ఐపీఎస్‌లేనని... కానీ ప్రస్తుత గవర్నర్ తమిళిసై ఎప్పుడూ బీజేపీ వైపే చూస్తారని విమర్శించారు. 


గవర్నర్ తమిళిసై మాటలను ఎవరూ నమ్మే అవకాశం లేదని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గవర్నర్ వక్రబుద్దితో వ్యవహరిస్తున్నారని... అనవసరంగా నోరు పారేసుకోవడం మానుకోవాలని సూచించారు. అసలు గవర్నర్‌ను ప్రభుత్వం ఎక్కడ అవమానపర్చిందో చెప్పాలని నిలదీశారు. గవర్నర్ తన పరిధిలో ఉంటే తప్పక గౌరవిస్తారని... గవర్నర్ హోదాలో ఆమె రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తే బాగుంటుందని అన్నారు. గతంలో గవర్నర్‌గా వ్యవహరించిన నరసింహన్ ప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందించారని గుర్తుచేశారు.


కాగా, ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తనను అవమానిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను తానొక అన్నగా భావించానని...  కానీ ఆయన మాత్రం తనను అవమానించారని అన్నారు. వ్యక్తిగా తనను గౌరవించకపోయినా గవర్నర్ పదవిని గౌరవించాలన్నారు. 


Also Read: RRR Records: ఆర్​ఆర్​ఆర్​ అరుదైన రికార్డు- బాలీవుడ్ సినిమాలకు పోటీగా కలెక్షన్లు


Also Read: Realme GT 2 Pro: మార్కెట్లోకి రియల్​మీ జీటీ 2 ప్రో- ఫీచర్లతో పాటు ఆఫర్లూ అదుర్స్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook