Jagadish Reddy Press Meet : ప్రధాని మోదీపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై విషం చిమ్మేలా ఉన్నాయని అన్నారు. సంవత్సరం క్రితమే ప్రారంభమైన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మళ్లీ కొత్తగా ప్రారంభించడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ కోసం కొత్తగా చేసిందేమీ లేదని ప్రధాని మోదీ పర్యటనను మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపి ఓటమి పాలయ్యిందనే అక్కసు ప్రధాని మోదీ మాటల్లో స్పష్టంగా అర్థమవుతోందని.. అదే అక్కసును ఆయన తన మాటల్లో వెళ్లగక్కారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు ఎన్నిసార్లు తెలంగాణకు వచ్చినా.. రాష్ట్రానికి రూపాయి ఇచ్చింది లేదు. తెలంగాణకు మీరు వడ్డీతో సహా ఇస్తానని అన్నారు. కానీ మీకే దేశ ప్రజలు తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తారు. అంటూ ప్రధాని నరేంద్ర మోదీ రాకపై మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. తెలంగాణకు బ్యాంకు లోన్లు రాకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుని టిఆర్ఎస్ పార్టీలో అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. 


జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రస్థానం ఇంకా ఆరంభించక ముందే బీజేపిలో వణుకు మొదలైందని.. ఆ భయమే వారి చేత ఇలా మాట్లాడిస్తోందని జగదీష్ రెడ్డి అన్నారు. బీజేపి ఎన్ని కుట్రలు చేసినా.. తెలంగాణ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరన్న మంత్రి జగదీష్ రెడ్డి.. తెలంగాణ ప్రజలు గుజరాత్ ప్రజలు కాదని అన్నారు. గత 8 ఏళ్లలో తెలంగాణలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజానికం అంతా చూస్తోందని.. దేశంలో మీకు ఎదురులేకుండా చేసుకుని, నాయకులు, పార్టీలను భయపెట్టి రాజ్యమేలాలని కుట్రలు చేస్తున్నారు కానీ అది సాధ్యపడదని బీజేపికి స్పష్టంచేశారు.


కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విషం కక్కినప్పటికీ.. తెలంగాణ ప్రజలు హంసల్లాంటి వారని... నీళ్లు.. పాలను వేరు చేసినట్లుగానే బీజేపి నేతలు చిమ్మే విషాన్ని కూడా వేరు చేసి చూస్తారని మంత్రి జగదీష్ రెడ్డి హితవు పలికారు. దేశంలో బీజేపీ పీడను వదిలించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మరింతగా ముందుకు పోతాం అని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ ఓవైపు తెలంగాణలో అభివృద్ధి ఆగొద్దు, సంక్షేమ పథకాలు ఆపొద్దు అని అప్పోసప్పో చేసి తెలంగాణను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు తెలంగాణ అభివృద్ధికి అన్నిరకాల ఆటంకాలు కలిగించి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటుందే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 


బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా చేసి, బ్యాంకులను భయపెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. బీజేపి ఎన్ని కుట్రలు చేసినా.. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వం బలంగా ఉందని, తెలంగాణ ప్రజల్లో కేసీఆర్‌పై ఉన్న అభిమానం మరోసారి మునుగోడు ఉప ఎన్నికలో గెలుపుతో రుజువైందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు చూసే ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చి, కేసీఆర్‌పై ( CM KCR ) విషం చిమ్మి పోయారని అర్థమవుతోందని మండిపడ్డారు.


Also Read : KCR VS MODI: జగన్ అలా.. కేసీఆర్ ఇలా! తెలంగాణకు లాభమా..నష్టమా?


Also Read : Bandi Sanjay: నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్‌కి బండి సంజయ్ సూటి ప్రశ్నలు


Also Read : TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసు.. పోలీసులకు నో చెప్పిన ఏసీబీ కోర్టు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook