Konda Surekha controversy: కొండా సురేఖ ఈ పేరు ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఈమహిళ మంత్రి ఏ మూహుర్తానికి కేటీఆర్ , నాగార్జున ఫ్యామిలీ గురించి వివాదాస్పదంగా మాట్లాడారో.. ఒక్కసారిగా ఆమె కాంట్రవర్సీకి కేరాఫ్ లాగా మారిపోయారు. ఎక్కడకు వెళ్లిన, ఏం మాట్లాడిన కూడా ఆమె చేస్తున్న పనులు డైరెక్ట్ గానో, ఇన్ డైరెక్ట్ గానే వివాదస్పదంగా మారుతున్నాయి. కేటీఆర్ కు డ్రగ్స్ తీసుకుంటారని, ఇండస్ట్రీలో అమ్మాయిల్ని వేధిస్తున్నాడని, అంతే కాకుండా.. సమంతా , నాగచైతన్యల డైవర్స్ వెనుక కేటీఆర్ కారణమని కూడా మంత్రి కొండా సురేఖ బాంబు పేల్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈ వివాదం కాస్త కోర్టు వరకు వెళ్లింది.మరోవైపు  ఇటీవల కొండా సురేఖ.. ఏకంగా పోలీసు స్టేషన్ కు వెళ్లి సీఐ కూర్చిలో కూర్చున్నారు. ఇది కూడా రచ్చగా మారింది. తాజాగా, మంత్రి కొండా సురేఖ వేముల వాడ రాజన్నను దర్శించుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఆమె దర్శనం చేసుకునే క్రమంలో స్వామి వారికి చేయాల్సిన నైవేద్యం సేవను అధికారులు అరగంట ఆలస్యంగా చేశారంట.


వేముల వాడలో గత కొన్నేళ్లుగా కొన్నిసమయాలు పెట్టుకుని ఆ టైమ్ లో చేయాల్సిన పూజలు, నైవేద్యాలు మొదలైనవి అర్పిస్తుంటారు. అయితే.. ఇప్పుడు మాత్రం కొండా సురేఖ రాజన్న ఆలయంకు రావడం వల్ల... రాజన్నకు సమర్పించాల్సిన మహానైవేద్యంను అరంట పాటు ఆలస్యంగా నివేదన చేశారంట. దీంతో  కొంత మంది అర్చక స్వాములతో పాటు, అక్కడి ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారంట.


Read more: Amrapali: మోదీ సర్కారుకు బిగ్ షాక్.. బదిలీలపై అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఆమ్రపాలీ.. దెబ్బ అదుర్స్ కదా..


ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేతలు వస్తే.. దేవుడికి నియమంగా చేసే సేవలలో ఇలాంటి పనులు చేయడమేంటని అక్కడి వారు ఫైర్ అవుతున్నారు. దీంతొ కొండా సురేఖ మాత్రం మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తొంది.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter