Mynampalli Hanmatha Rao Comments on Minister Harish Rao : మంత్రి హరీశ్ రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు చేసిన ఘాటు వ్యాఖ్యలకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంతే ఘాటుగా స్పందించారు. మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. తన కుటుంబ సభ్యునికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించింది అనే కారణంగా తమ పార్టీ ఎమ్మెల్యే ఒకరు మంత్రి హరీష్ రావుపై కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ట్వీట్ చేశారు. సదరు ఎమ్మెల్యే ప్రవర్తనను తాను తీవ్రంగా ఖండించడమే కాకుండా మంత్రి హరీశ్ రావుకి మనమందరం అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేయాలనుకుంటున్నాను అని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైనప్పటి నుండి పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నాయకుడు అని గుర్తుచేసిన మంత్రి కేటీఆర్.. పార్టీలో ఇకపై కూడా మంత్రి హరీశ్ రావుది కీలక స్థానమేనని.. ఆయన తమ పార్టీకి మూలస్తంభం వంటి వారు అని చెబుతూ హరీశ్ రావుకి అండగా నిలిచే ప్రయత్నం చేశారు. మైనంపల్లి హన్మంత రావు వ్యాఖ్యలపైనే మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసినప్పటికీ.. ఆ ట్వీట్ లో నేరుగా మైనంపల్లి పేరెత్తకుండానే పరోక్షంగా ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.



 


ఇదిలావుంటే, ఇదే ఘటనలో మంత్రి హరీశ్ రావుపై మల్కాజిగిరి ఎమ్మల్యే మైనంపల్లి హన్మంత రావు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం స్పందించారు. తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీష్ రావు నిబద్ధత, బీఆర్ఎస్ పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. హరీష్ రావుపై తమ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అంటూ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.



ఇది కూడా చదవండి : Mynampalli Hanmantha Rao: మైనంపల్లిపై కేసీఆర్ యాక్షన్ తీసుకుంటారా


మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి హన్మంత రావు వ్యాఖ్యలను ఖండించేందుకు ట్వీట్వ్ చేసిన మంత్రి కేటీఆర్ కానీ లేదా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కానీ.. ఈ ఇద్దరూ సూటిగా హన్మంత రావు వ్యాఖ్యలనే ఖండించినప్పటికీ.. ఇద్దరూ కూడా తమ ట్వీట్స్‌లో నేరుగా మైనంపల్లి హన్మంత రావు పేరు ఎత్తకపోవడం గమనార్హం. పార్టీలో అగ్రనేతలుగా కొనసాగుతూ, కీలక పదవుల్లో ఉన్న నేతలే తమ పార్టీకే చెందిన ఎమ్మెల్యే పేరు ఎత్తలేకపోవడం ఏంటంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఇది కూడా ఓ హాట్ టాపిక్ అవుతోంది.


ఇది కూడా చదవండి : YS Sharmila about KCR: కేసీఆర్‌కు నిజంగానే దమ్ముంటే.. వైఎస్ షర్మిల ఛాలెంజ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి