వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సామజవరగమణ అనే పాడుతున్నారు. పాటను కంపోజ్ చేసిన టాలీవుడ్ సంగీత దర్శుడు ఎస్ థమన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పాట తనకు కంపెనీ ఇస్తుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. నిత్యం రాజకీయాలు, రాష్ట్ర పాలన అంశాలతో బిజీగా ఉండే కేటీఆర్.. రిలాక్సేషన్ కోసం మ్యూజికల్ హిట్ సాంగ్స్ వింటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేటీఆర్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ పర్యటనలో ఉన్నారు. అయితే విమానం ఆలస్యం కాగా, రిలాక్స్ అవుదామని మన తెలుగు పాట సామజవరగమన విన్నారు. తన అనుభూతిని నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ‘విమానం కాస్త ఆలస్యమైంది. స్విట్జర్లాండ్‌లో ఇప్పుడు ఉదయం 3:30 అవుతోంది. కంపెనీ కోసం నా ప్లే లిస్ట్‌లో ఉన్న ‘సామజవరగమన’ పాట విన్నాను. బ్రిలియంట్ సాంగ్. పాట నా మైండ్‌లో అలాగే ఉండిపోతుంది. థమన్ నీకు నీవే సాటి’ అని కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. థమన్‌ను సైతం కేటీఆర్ తన ట్వీట్‌లో ట్యాగ్ చేశారు.



మంత్రి కేటీఆర్ ప్రశంసపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చాలా సంతోషంగా స్పందించాడు. ‘సార్.. మీ నుంచి ఇలాంటి కామెంట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా పాటను మీరు మరింత సెన్సేషనల్ చేశారు. మాకు మరింత బలాన్నిస్తోంది. మీ అభిమానం పెరిగింది సార్. మీకు సెన్సేషనల్ అయిన మా సామజవరగమన పాట తెలియడం చాలా సంతోషంగా ఉంది. మాకు కావాల్సిన బెస్ట్ ఇప్పుడు దొరికిందని’ కేటీఆర్ ట్వీట్‌పై థమన్ ట్వీట్ కామెంట్ చేశారు. 



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..