Minister KTR Fell Down Video: మంత్రి కేటీఆర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ జిల్లా పర్యటనలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఆర్మూర్‌లో ర్యాలీగా నామినేషన్‌ వేసేందుకు వెళ్తుండగా డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రచారరథంపై నుంచి కిందపడ్డారు కేటీఆర్‌. ఆర్మూరు పట్టణంలోని పాత ఆలూరు రోడ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కేటీఆర్‌ వాహనంపైనే కిందపడగా.. రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రథం నుంచి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో కేటీఆర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే ఎవరికీ ఏం కాకపోవడంతో జీవన్‌ రెడ్డితో పాటు కేటీఆర్ నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అదృష్టవశాత్తు తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందవద్దని కోరారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం కేటీఆర్.. కొడంగల్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ ప్రచారం రథంపై నుంచి కిందపడిపోయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



Also Read: Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


Also Read: 3 Liters Instant Water Geyser Price: క్రోమాలో దీపావళి ఆఫర్స్‌..Usha Instano 3 లీటర్స్‌ వాటర్ గిజర్‌ను రూ.3,550కే పొందండి!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook