Minister KTR on Handloom Workers: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగల్లోని కార్మికులు బతికించుకోవాలని అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేతపై 5 శాతం జీఎస్టీ వేసిన ఘనత మోడీకే దక్కుతుందని అన్నారు. పద్మశాలి కుటుంబంలో ఉండి మన ముఖ్యమంత్రి చదువుకున్నారని.. వారి సమస్యలు ఆయనకు తెలుసని చెప్పారు. హైదరాబాద్‌లోని మన్నెగూడలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం 2023 వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు గుడ్‌న్యూస్ ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"చేనేత మిత్ర పథకంలో రాబోయే నెల నుంచి ప్రతి మగ్గానికి నెలకు 3 వేల చొప్పున ప్రతి కార్మికుడికి అందజేస్తాం.. రైతులకు రైతు బీమా చేయించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. 
నేతన్న బీమా ఇస్తున్నాం. 59 ఎళ్ల పైబడిన వారికి ప్రభుత్వమే బీమా ఇస్తుంది. ప్రైమ్ మగ్గాలు ఏర్పాటు కోసం రూ.40.50 కోట్లు అందిస్తాం.. ఒక్కొక్క మగ్గానికి 38 వేల రూపాయలు చొప్పున అందజేస్తాం. చేనేత కార్మికులకు ఐడీ కార్డులు ఇస్తున్నాం.


టెస్కో ద్వారా వీవర్స్ మెంబర్స్‌కు ఎక్స్ గ్రేషియా 25 వేలకు పెంచాం. నేత కార్మికుల కోసం గృహలక్ష్మి తీసుకోస్తాం. కార్మికులుగా సూరత్ వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో పారిశ్రామిక వేత్తలుగా వచ్చారు. ఉప్పల్ బాగాయత్‌లో హ్యాండ్లుమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం.. ఇప్పటికే శంకుస్థాపన చేశాం.. పోచంపల్లి హ్యాండ్లుమ్ పార్క్ రూ.12.60 కోట్లతో పునరుద్ధరణ చేస్తున్నాం. చేనేతపైన ప్రధాని మోడీ ఐదు శాతం జీఎస్టీ వేశారు. చేనేత వద్దు.. పథకాలు అన్ని రద్దు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం తీరు ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి అందులోని నాయకులకు నేత తెలవదు. నేతన్నల కష్టాలు తెలవదు. రాబోయే రోజుల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది.. అందులో మన ప్రభుత్వం ఉంటుంది. కేంద్రం రద్దు చేసిన కార్యక్రమాలన్నీ కూడా తీసుకువస్తాం. మీకు పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండండి." అని కేటీఆర్ కోరారు.


మంత్రి  శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నేతన్నకు గీతన్నకు అవినాభావ సంబంధం ఉందని అన్నారు. కుల వృత్తులు ఆధునిక కాలంలో అంతరించి పోయాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పునరుద్ధరణ చేసిందన్నారు. మంత్రి కేటీఆర్ చేనేత ఔళి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నేతన్నల బతుకులు మారాయన్నారు. బీసీల కోసం 1000 గురుకులాలు ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం అని అన్నారు. హైదరాబాద్‌లో మన కుల సంఘాలకు జాగా ఇచ్చి పైసలు ఇచ్చి భవనాలు కడుతున్నారని అన్నారు. 


Also Read: Delhi AIIMS Fire Accident: ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులో మంటలు  


Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి లైన్ క్లియర్.. పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి