Minister KTR Vs Bandi Sanjay: తెలంగాణలో రాజకీయాలు ఫుల్ హీటెక్కిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజీ ఘటనలు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తున్న తరుణంలో ఆమె అరెస్ట్ తప్పదంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ పేపర్లు లీక్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం స్పందించి పేపర్ల లీకేజీపై సిట్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సిట్ ఈ బృందం వేగంగా వివరాలు సేకరిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు మంత్రి కేటీఆర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఉగాది సందర్భంగా తమదైన శైలిలో పంచాంగం చెప్పారు. బస్, బభ్రాజీమానం భజగోవిందం అంటూ కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేయగా.. 'తుస్.., పిట్టల దొర' అంటూ బండి సంజయ్ కూడా అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు. 


'ఆదాయం: అదానీకి!
వ్యయం: జనానికి, బ్యాంకులకు!


అవమానం: నెహ్రూకి!
రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!!


బస్, బభ్రాజీమానం భజగోవిందం!
దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!..' అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ట్వీట్‌కు కౌంటర్‌గా బండి సంజయ్ కూడా పోస్ట్ చేశారు. 


 




'ఆదాయం: కల్వకుంట్ల కుటుంబానికి
వ్యయం: తెలంగాణ రాష్ట్రానికి


అవమానం: ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు
రాజపూజ్యం: ఉద్యమ ద్రోహులకు, దొంగలకు !!


తుస్.., పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి.. పతనం ఇగ షురువాయే..' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


 




టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజీ ఘటనలో మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పరీక్షల రద్దు నేపథ్యంలో నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాల్సిందేనంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతున్నారు. ‘‘మా నౌకరీలు మాగ్గావాలె’’ నినాదంతో ఈనెల 25న ఇందిరాపార్క్ వద్ద  ‘‘నిరుద్యోగ మహా ధర్నా’’ చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే నిరుద్యోగ యువతతో కలిసి ఈ నిరుద్యోగ మహా ధర్నా నిర్వహించనుంది.


Also Read: Ind Vs Aus 3rd Odi Updates: కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ బాల్.. షాక్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్  


Also Read: Ind Vs Aus: రాణించిన బౌలర్లు.. భారత్ లక్ష్యం ఎంతంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి