హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ ( Minister KTR ) జలుబుతో బాధపడుతుండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో జరిగిన ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. అక్కడ జలుబుతో బాధపడటం ( Minister KTR sneezes ) అందరినీ ఆందోళనకు గురిచేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న సందర్భంలో కూడా మంత్రి కేటీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రజా సేవలో ముందున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కరోనావైరస్ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. కరోనాపై పోరాటంలో ముందున్న మంత్రి కేటీఆర్ ఇలా జలుబుతో బాధపడటం చూసి ఆయన అభిమానులు తట్టుకోలేకపోయారు. ఇదే విషయమై ట్విటర్ ద్వారా స్వయంగా ఆయననే అడిగారు. ఈ నేపథ్యంలో తాను జలుబుతో బాధపడుతుండటంపై కొందరు ఆందోళన చెందడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

Also read : గోపీచంద్‌కి క్వారంటైన్ స్టాంప్.. స్పందించిన బ్యాడ్మింటన్ కోచ్


గత కొంతకాలంగా తాను అలర్జీ లాంటి ఫ్లూతో బాధపడుతున్నానని... ఇటీవల సిరిసిల్ల పర్యటనకు వెళ్తుండగా మార్గం మధ్యలో అది మళ్లీ తిరగతోడిందని గుర్తు చేసుకున్నారు. అయితే, అప్పటికే సిరిసిల్లలో ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో అకస్మాత్తుగా పర్యటన రద్దు చేసుకుని అక్కడున్న వారిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్లడం జరిగిందని ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలని ఆయన తన ట్విట్టర్‌ పోస్టులో పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..