హైదరాబాద్: తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురై నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి జగదీష్ రెడ్డిని మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామా రావు పరామర్శించారు. మంత్రి జగదీష్ రెడ్డి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఆయన.. మంత్రి జగదీష్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్టు తెలిపారు. అదే సమయంలో నిమ్స్‌లోనే చికిత్స పొందుతున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తండ్రి మొగులయ్యను, అదే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ మంత్రి రత్నాకర్ రావును కూడా మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ప్రగతి భవన్‌లో పనిచేస్తున్న కుక్ వెంకటేష్‌ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం నిమ్స్‌లోనే వైద్య చికిత్స పొందుతున్నాడు. దీంతో కుక్ వెంకటేష్‌ని సైతం మంత్రి కేటీఆర్ పరామర్శించి, ఆయనకు అందుతున్న వైద్యసేవల గురించి నిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 


అలా ఒకేరోజు వేర్వేరు విభాగాల్లో వివిధ రకాల చికిత్సలు పొందుతున్న వారిని పరామర్శించి మంత్రి కేటీఆర్ వారిపట్ల తనకున్న అభిమానాన్ని, సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు.