హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా విద్యార్థులకు సంబంధించి పలు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, వాయిదా పడిన ఆ పరీక్షల సంగతేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతుండటంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విద్యార్థుల పరీక్షల పట్ల తల్లిదండ్రుల్లో ఆందోళన ఉండటం సహజమే అయినప్పటికీ.. ఇటువంటి క్లిష్ట సమయాల్లో ఏం జరగనుందో చూడాలనేట్టుగా కొంత సహనం కూడా ఉండాలని అన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్.. #AskKTR పేరుతో శుక్రవారం ట్విట్టర్ ద్వారా కాసేపు నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తొలగింపు


ఈ సందర్భంగా కరోనా వైరస్ నివారణ కోసం ఇంకా లాక్ డౌన్ కొనసాగిస్తారా ? అనే ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. లాక్‌డౌన్‌ను పొడిగించాల‌నేది త‌మ పార్టీ వ్యక్తిగత అభిప్రాయమే అయినప్పటికీ.. లాక్ డౌన్ కొనసాగించడమా ? లేక ఎత్తేయడమా అనేది ప్రభుత్వంతో పాటు ఇత‌ర ప‌క్షాల‌తోనూ క‌లిసి చర్చించిన తర్వాతే  ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇలా ప్రజల జీవితాలపై లాక్‌డౌన్ చూపించిన ప్రభావంపై అనేక ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ తనదై స్టైల్లో సమాధానాలిచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..