Uttam Kumar Reddy: 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి.. బాంబ్ పేల్చిన మంత్రి ఉత్తమ్
Telangana Politics: లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరుతున్నారనే వార్తలు జోరందుకుంటున్నాయి. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాంబ్ పేల్చారు. బీఆర్ఎస్ 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ బాంబ్ పేల్చారు.
Telangana Politics: కాంగ్రెస్ పార్టీలో చేరికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని తెలిపారు. తమ పార్టీలోకి వచ్చేందుకు నేతలు రెడీగా ఉన్నట్లు చెప్పారు. అయితే కేసీఆర్ వైఖరి వల్లే ఆ పార్టీకి ఈ దుస్థితి పట్టిందన్నారు. నిన్న కరీంనగర్‌లో కేసీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. పదేళ్లలో ఇరిగేషన్ మీద లక్షల కోట్ల దోపిడీ చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను బొంద పెడితే.. 104 మంది ఎమ్మెల్యేల నుంచి 39కి పడిపోయారన్నారు. కేసీఆర్‌కు తెలివి తక్కువ పొగరు ఎక్కువ అని విమర్శించారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎవ్వడు పడరు.. ప్రపంచంలో నువ్వొక్కడివే మేధావివా..? అని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగిందన్నప్పుడు ఎడా పడుకున్నావని నిలదీశారు. తమకు అభివృద్ధి చేయడం తెలుసని.. కేసీఆర్‌కు కమిషన్లు తీసుకోవడం తెలుసని అన్నారు. అయితే చేరికలపై ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. లోక్‌సభ ఎన్నికల వేళ ఎమ్మెల్యేల జంప్ వార్తలు బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. వరుసగా కీలక నేతలు పార్టీని వీడుతుండడంతో గులాబీ శ్రేణుల్లో నిస్తేజం నెలకొంది.
Also Read: Anaparthi Seat: అనపర్తి అసమ్మతిపై చంద్రబాబు దిగొచ్చినట్టేనా, సీటు మార్చే ఆలోచన
"కేసీఆర్ లెక్క పాస్ పోర్టులు అమ్మి, కాంట్రాక్టర్లకు బ్రోకర్లలాగా పనిచేయలేదు. ఎవరినో తొక్కడం కాదు.. ఈ ఎన్నికల్లో జనం కేసీఆర్‌ను బొంద పెడతారు. కేసీఆర్ ఫ్రస్టేషన్‌లో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇరిగేషన్‌పై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కేసీఆర్ ఇంట్ల పన్నడు. కేసీఆర్ పిచ్చిలేచినట్లు మాట్లాడుతున్నారు.. కేసీఆర్ సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నారు. ఇవ్వాళ బ్రోకర్, జోకర్ వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్.. ఆనాడు సీఎంగా ఉండి మేడిగడ్డపై ఎందుకు నోరు విప్పలేదు. కేసీఆర్ లెక్క వేరే రాష్ట్రాల్లో మాట్లాడితే ఉరి తీస్తారు.
సూర్యాపేటకు సాగునీళ్ళు కాదు ఇచ్చింది.. తాగునీరు మాత్రమే నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు వదిలారు. సూర్యాపేట, పాలేరుకు కేసీఆర్ మొకం చూసి నీళ్ళు ఇవ్వలేదు.. మా షెడ్యూల్ ప్రకారం ఇచ్చాం. కేసీఆర్ అంతా పొగరుబోతు వ్యక్తిని నేను ఇంకొకరిని చూడలేదు. కేసీఆర్ కమిషన్ల కకుర్తి వల్లే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం ప్రాజెక్టుగా మారింది. కేసీఆర్ పొగరు వల్లే 104 ఎమ్మెల్యేల ఉన్న బీఆర్ఎస్ 39కి వచ్చారు. ఇందులో 25 మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ కరువు కేసీఆర్ తెచ్చింది మాత్రమే.. కాంగ్రెస్ తెచ్చింది కాదు. కేసీఆర్ మాటలు ప్రజలు నమొద్దు.. రాష్ట్రంలో పవర్, డ్రింకింగ్ వాటర్ సమస్య రాదు.." అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Also Read: ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ కెరియర్ లోనే అత్యంత తక్కువ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook