Governor Rejects Names of Two nominated MLCs: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ త‌మిళిసై  సౌందరరాజన్ తిరస్కరించడంపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. గ‌వ‌ర్నర్  చ‌ర్య స‌మాఖ్య స్పూర్తికి గొడ్డ‌లిపెట్టు వంటిద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై రాష్ట్ర కాబినెట్ చేసిన సిఫార‌సును గవర్నర్ తిరస్కరించ‌డాన్ని ఆయన తప్పుపట్టారు. కేబినెట్‌లో చర్చించి.. ఆమోదించి పంపిన సిఫార‌సును గవర్నర్‌ ఆమోదించకపోవటం రాజ్యాంగ వ్యతిరేకమని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం  గవర్నర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని.. రాజ‌కీయ క‌క్ష్య‌సాధింపుల‌కు పాల్ప‌డుతున్నారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వాల అభీష్టానికి అనుగుణంగా గవర్నర్లు వ్యవహరించాలని హితవు పలికారు. గ‌తంలో ఏ గ‌వ‌ర్నర్ ఇలా వ్య‌వ‌హ‌రించిన దాఖ‌లాలు లేవ‌ని గుర్తు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గవర్నర్ తీరును శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రెడ్డి కూడా ఖండించారు. "గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ ను రాజకీయ అడ్డాగా మార్చుకుని రాజకీయాలు చేస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను  రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపి పంపితే వారికి రాజకీయ నేపథ్యం ఉందని రిజెక్ట్ చేయడం దుర్మార్గం. అత్యంత వెనుక బడిన కులాలకు (ఎంబీసీ)చెందిన సామాజిక కార్యకర్త దాసోజు శ్రవణ్, షెడ్యుల్ తెగకు (ఎస్టీ) చెందిన సామాజిక కార్యకర్త కుర్రా సత్యనారాయణలను రిజెక్ట్ చేయడం యావత్ తెలంగాణ ఎంబీసీ కులాలను, ఎస్టీ (ఎరుకల) సమాజాన్ని అగౌర పర్చినట్టే. 


రాజకీయ నేపథ్యం ఉందని తెలంగాణ ఉద్యమకారులను అవమాన పరిచిన గవర్నర్ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ డైరెక్ట్‌గా తెలంగాణ గవర్నర్‌గా నియమకం కాలేదా..? తమిళి సైకి నైతిక విలువలు ఉంటే ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలి." అని మంత్రి వేమల డిమాండ్ చేశారు.


సర్కారియ కమిషన్ చెప్పినట్టు రాజకీయాలకు సంబంధం లేని వారిని గవర్నర్లుగా నియమించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ పలు మార్లు వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు. సర్కారియ కమిషన్ సూచనలు తుంగలో తొక్కి ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిని గవర్నర్‌గా నియమించారని విమర్శించారు. ఇది పూర్తిగా సర్కారియా కమిషన్ సూచనలకు విరుద్ధమన్నారు. రాజకీయాల నుంచి నేరుగా గవర్నర్ అయిన తమిళి సైకి గవర్నర్ గా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. గవర్నర్ నిర్ణయం అప్రజాస్వామికం అని.. ఆమె తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. 


Also Read: Jio AirFiber: జియో ఎయిర్ ఫైబర్ లాంచ్, ఇంటర్నెట్ స్పీడ్, ఫ్రీ ఓటీటీ ఇతర ప్లాన్స్


Also Read: Minister KTR: మారనున్న హైదరాబాద్ రూపురేఖలు.. ఐదు బ్రిడ్జిల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి