Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలపై మిషన్ చాణక్య సర్వే, అధికారం ఆ పార్టీకే
Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తోంది. మరో రెండ్రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనుంది. వివిధ సంస్థల సర్వేలు ఇప్పటికే రాజకీయంగా వేడి పుట్టిస్తుంటే..మిషన్ చాణక్య సర్వే ఆసక్తి కల్గిస్తోంది. మిషన్ చాణక్య సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి...
Telangana Elections 2023: తెలంగాణ సహా దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ మిజోరాంతో పాటు ఛత్తీస్‌గఢ్ తొలిదశ పోలింగ్ జరుగుతోంది. మరోవైపు తెలంగాణ ఎన్నికలపై ప్రముఖ సర్వే సంస్థ మిషన్ చాణక్య సర్వే వెల్లడైంది. ఈ సర్వేలో ఆ పార్టీకే స్పష్టమైన ఆధిక్యం కన్పిస్తోంది. ఇప్పటికే వేర్వేరు సంస్థల సర్వేలు వేర్వేరుగా ఫలితాలు ప్రకటించాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మరో రెండ్రోజుల్లో నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తి కానుంది. ఈ క్రమంలో ప్రముఖ సర్వే సంస్థ మిషన్ చాణక్య తెలంగాణ ఎన్నికలపై విస్తృతంగా సర్వే చేపట్టింది. ఆ ఫలితాల ప్రకారం తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీకే అధికారం దక్కనుంది. ఈ సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీకు 44.62 శాతం, కాంగ్రెస్ పార్టీకు 32.71 శాతం, బీజేపీకు 17.6 శాతం ఓట్లు దక్కుతాయని తేలింది. బీజేపీ గత ఎన్నికలతో పోలిస్తే కాస్త బలపడిందని మిషన్ చాణక్య సర్వే అభిప్రాయపడింది. బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా 68-74 సీట్లతో స్పష్టమైన ఆధిక్యం కనబర్చి మూడోసారి అధికారం కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 24-32 స్థానాల్లో, బీజేపీ 2-5 స్థానాలు, ఎంఐఎం 6-7 స్థానాల్లో విజయం సాధించనున్నాయి.
ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వం పరంగా కూడా కేసీఆర్‌కే ఎక్కువమంది మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌కు అత్యధికంగా 56.41 శాతం మంది ఓటేస్తే రేవంత్ రెడ్డికి 24.5 శాతం మంది బలపర్చారు. ఇక బీజేపీ బీసీ సీఎం నినాదం ఆ పార్టీకు కాస్త లాభించవచ్చని మిషన్ చాణక్య సర్వే అభిప్రాయపడింది. మిషన్ చాణక్య తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని వయుస్సులవారి అభిప్రాయాలు సేకరించింది.
Also read: AP Schools & Colleges Bandh: విశాఖ, కడప ఉక్కుకై రేపు విద్యా సంస్థల బంద్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook