Mla gangula kamala kamalakar meets with brs chief kcr: తెలంగాణలో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత బీఆర్ఎస్ గా రూపాంతరం  చెందింది. దేశంలోని రాజకీయాలను శాసిస్తానని గతంలో కేసీఆర్ అనేక రాష్ట్రాలలో కాలుకి బలపం పెట్టుకుని మరీ తిరిగాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు బీఆర్ఎస్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. గులాబీబాస్ పార్టీకి కేవలం 39 స్థానాలు మాత్రమే కట్టబెట్టి అపోసిషన్ స్థానంలో కూర్చోబెట్టారు. మరోవైపు అనుకోకుండా.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పగ్గాలు చేపట్టి, సీనియర్లను పక్కన పెట్టి తన దైన చాణక్యంతో రేవంత్ రాజకీయాల్లో సొంత మార్కు చూపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Elephant Attacks On Mahout: మావటిని రెండుకాళ్లతో పిండి పిండి చేసిన ఏనుగు.. షాకింగ్ వీడియో వైరల్..


అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ  64 స్థానాలను గెలుచుకుంది. ఇక అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి వరుస కష్టాలు మాత్రం ఆగడం లేదు. ఒకవైపు కూతురు కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీలో తీహర్ జైలులో రిమాండ్ లో ఉంది. మరోవైపు ఫోన్ టాపింగ్ వ్యవహరం, ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కోనుగోలు వంటి అంశాలు కేసీఆర్, కేటీఆర్ మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆపరేషన్ హస్తం స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.


వీరిలో.. దానం నాగేందర్ ఖైరతాబాద్, తెల్లం వెంకట్రావు భద్రాచలం, కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ,ఇక తాజాగా, సంజయ్ జగిత్యాల నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు కరీంనగర్ భీముడిగా ముద్దుగా పిలుచుకునే గంగుల కమలాకర్ కూడా పార్టీమారతారంటూ  జోరుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన దీన్ని కొట్టిపారేస్తు వచ్చారు. అయిన కూడా దీనిపై గులాబీపార్టీలో కాస్తంతా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ రూమర్స్ లపై చెక్ పెట్టేందుకు గంగుల తానే రంగంలోకి దిగారు.


మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు.. ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. గంగులతోపాటు మరో 29 మంది కార్పోరేటర్ లు కూడా ఆయనతో ఉన్నారు. తాను కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు విధేయుడినని పార్టీ మారే వార్తలను ఖండించారు. కొందరు లేనిపోనీ ఆరోపణలు చేసి, బీఆర్ఎస్ ను అస్థిర పర్చడానికి కుట్రలు పన్నుతున్నారని గంగుల అన్నారు. ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఒకవైపు ఆయన తొలినుంచి కవితక్కకు నమ్మిన బంటుగా చెబుతుంటారు.


Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..


పార్టీ ఇలాంటి కష్టపరిస్థితుల్లో ఉండగా ఆయన పార్టీ వీడటంపై అనేక మంది తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు.. కాంగ్రెస్ లోకి చేరడాని.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వాటిని ప్రొత్సహించకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కంటోన్మెంట్, ఐదురుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికతో అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్  పార్టీ బలం 70 కి చేరుకుంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి